Last Updated:
Tirupathi: సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మార్చి 19వ తేదీన ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం నిర్వహిస్తారు.
Tirupathi: సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మార్చి 19వ తేదీన ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం నిర్వహిస్తారు.
సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు పుష్ప పల్లకిలో అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. రాత్రి 8 నుండి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకల సందర్భంగా విఐపి బ్రేక్ దర్శనం, కుంకుమార్చన, ఊంజల్ సేవను టీటీడీ రద్దు చేసింది. భక్తులు సహాకరించాలని టీటీడీ పాలకమండలి కోరుతోంది.
టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్,సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు మార్చి 19న తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించబడనున్నాయి. ఈ కార్యక్రమం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళధ్వని నిర్వహించబడుతుంది. అనంతరం ఎస్వీ ఉన్నత వేద విద్యాధ్యయన సంస్థ పండితులు వేదపారాయణం చేస్తారు.
ఉదయం 10.05 గంటలకు ప్రముఖ పండితులు పంచాంగ శ్రవణం చేపడుతారు. అటు తర్వాత కవి సమ్మేళనం జరుగుతుంది. అనంతరం డా. పూజారి వరలక్ష్మి భగవద్గీత అనుష్టానం, శ్రీ హేమ వేంకట నారాయణ భగవద్గీత అష్టావధానం నిర్వహిస్తారు. టీటీడీ ఉద్యోగుల పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. పలు పోటీల్లో గెలిచిన ఉద్యోగులకు బహుమతులు అందజేస్తారు. చివరగా ఉగాది పచ్చడి ప్రసాదంగా పంపిణీ చేస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Tirupati,Chittoor,Andhra Pradesh



