Last Updated:
Shocking Incident: కొన్ని ఊహించని సంఘటనలు అత్యంత విషాదాన్ని మిగుల్చుతాయి. ఎంతలా అంటే రాత్రి నిద్రపోతున్న ఓ కుటుంబం టూ వీలర్ నుండి వచ్చే పొగ పీల్చి ప్రాణాలు కోల్పోవడం అందర్ని షాక్ కి గురి చేసింది.
Shocking Incident: కొన్ని ఊహించని సంఘటనలు అత్యంత విషాదాన్ని మిగుల్చుతాయి. ఎంతలా అంటే రాత్రి నిద్రపోతున్న ఓ కుటుంబం టూ వీలర్ నుండి వచ్చే పొగ పీల్చి ప్రాణాలు కోల్పోవడం అందర్ని షాక్ కి గురి చేసింది.అన్నమయ్య జిల్లాలో జరిగిన విషాద సంఘటన యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారిని షాక్‌కి గురి చేసింది. పుంగనూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఊహించని ఘటన ఆదివారం వెలుగులోకి రావడం జరిగింది. రాత్రి నిద్రలోకి జారుకున్న ఓ కుటుంబం శాశ్వత నిద్రలోకి వెళ్లి తిరిగిరాని లోకాలకు చేరుకుంది. తమకు ఎంతో ఇష్టమైన బైక్ ఆ ఫ్యామిలీని మట్టుబెడుతుందని ఈ ఊహించలేకపోయారు.
పుంగనూరు పట్టణంలోని త్యాగరాజు వీధికు చెందిన రామచంద్ర అనే వ్యక్తి తన బైక్‌ని మెకానిక్ వద్దకు తీసుకెళ్లి ఇంజన్ ను బోర్ చేయించాడు . అనంతరం బోర్ చేస్తే ఆ వాహనాన్ని 24 గంటల సేపు కూలింగ్ లో పెట్టాలని మెకానిక్ చెప్పడంతో రామచంద్ర ఇంటికి వచ్చి ఆ వాహనాన్ని ఇంట్లో పెట్టి రాత్రంతా వాహనాన్ని రన్నింగ్ లో పెట్టాడు. రాత్రంతా వాహనం రన్నింగ్‌లో ఉండటంతో అందులో ఉన్న కార్బన్ డైయాక్సడ్ ఇంట్లో నిండి నిద్రిస్తున్న ముగ్గురు చిన్నారులు, రామచంద్ర మృతి చెందారు. ఉదయాన్నే గమనించిన చుట్టుపక్కల వాసులు తలుపులు పగలకొట్టి చూసే లోపు చనిపోయినట్టుగా తేల్చారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. అసలు ఎలా చనిపోయారనే విషయంపై ఆరా తీయడంతో ప్రాణాలు పోవడానికి గల కారణం తెలిసింది. పోస్ట్ మార్ట్ కోసం నలుగురును తరలించారని సి ఐ సుబ్బా రాముడు తెలిపారు. మృత్యువు ఇలా దాపరిస్తుందని కలలో కూడ ఊహించని కుటుంబం నిద్రలోనే మృత్యు ఒడికి చేరుకుంది. అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులు, ఒక వృద్ధుడు నిద్రలోనే మృతి చెందారు.
పుంగనూరు పట్టణంలోని త్యాగరాజు వీధి చెందిన మురళి, అతని ఏడేళ్ల కుమార్తె స్పందన ,చరితతో పాటు 15ఏళ్ల వయసున్న కొడుకు కార్తీక్, మురళి తండ్రి 70 సంవత్సరాల వయసున్న రామచంద్ర నిద్రిస్తున్న ఇంట్లో ద్విచక్ర వాహనం పెట్టి తలుపు వేసుకొని వెళ్ళాడు. ఇంజన్ బోర్ చేసిన వాహనం రాత్రంతా కూలింగ్ కోసం రన్నింగ్ లో పెట్టాడు. ఆ వాహనంలో వచ్చిన పొగ ఇంట్లోనే చొరబడి బయటకు వెళ్లే మార్గం లేక నిద్రిస్తున్న నలుగురు ఆ పొగను పీల్చి మృతి చెందారు. ద్విచక్ర వాహనం మృతికి దారి తీస్తుందని కలలో కూడా ఊహించని మురళి వాపోయాడు. విషయం తెలిసి కాలనీ వాసులు ఒక్కసారిగా విగత జీవులుగా పడిన మృత దేహాలను చూసి తల్లడిల్లారు. కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. జరిగిన ఘటన స్థలాన్ని పోలీస్ బృందం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తోంది.
Punganur,Chittoor,Andhra Pradesh


