ఈ చర్యలను యూఏఈ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ క్షిపణి దాడులు UAE “సోదర” ఒమన్ సుల్తానేట్ రెండింటినీ లక్ష్యంగా చేసుకుని, వాటిని “ప్రమాదకరమైన ఉద్రిక్తత”గా అభివర్ణిస్తూ, దాని రాయబార కార్యాలయాన్ని వెంటనే మూసివేస్తున్నట్లు ప్రకటించింది. టెహ్రాన్ రాయబారి, దౌత్య సిబ్బందిని ఉపసంహరించుకోవడంతో పాటు యుఎఇ.. టెహ్రాన్‌లోని తన రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు మరియు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ నుంచి తన రాయబారి మరియు దౌత్య మిషన్ సభ్యులందరినీ ఉపసంహరించుకుంటున్నట్లు కూడా ప్రకటించింది.
డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపులో రాహుల్ గాంధీ:
వికారాబాద్.. అనంతగిరి హిల్స్‌లోని హరిత హోటల్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు సమావేశానికి లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ వ్యూహాలపై రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేయనున్నారు. ఒక రోజు పర్యటన కోసం ఉదయం రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు. తర్వాత రాహుల్, సీఎం, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కలిసి.. వికారాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లారు. వికారాబాద్ చేరుకున్న వారిని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, మంత్రులు సాదరంగా స్వాగతం పలికారు. తర్వాత SAP ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రాంగణంలో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. ఆ తర్వాత అనంతగిరి హిల్స్‌లోని హరిత హోటల్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు సమావేశానికి హాజరయ్యారు.


