GST SCAM: విశాఖలో భారీ జీఎస్టీ స్కాం.. నకిలీ ఇన్వాయిస్‌లు చూపించి అన్ని కోట్లు కొట్టేశాడా! | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

GST SCAM: విశాఖపట్టణంలో భారీ జీఎస్టీ స్కాం బయటపడింది. సీజీఎస్టీ అధికారులు పక్కా సమాచారంతో తనిఖీలు చేయడంతో విశాఖలో ఓ వ్యక్తి దొరికిపోయాడు. అతడు చేసిన మోసానికి అధికారులు అవాక్కు అయిపోయారు.

Rapid Read
GST SCAM: విశాఖపట్టణంలో భారీ జీఎస్టీ స్కాం బయటపడింది. సీజీఎస్టీ అధికారులు పక్కా సమాచారంతో తనిఖీలు చేయడంతో విశాఖలో ఓ వ్యక్తి దొరికిపోయాడు. అతడు చేసిన మోసానికి అధికారులు అవాక్కు అయిపోయారు.
GST SCAM: విశాఖపట్టణంలో భారీ జీఎస్టీ స్కాం బయటపడింది. సీజీఎస్టీ అధికారులు పక్కా సమాచారంతో తనిఖీలు చేయడంతో విశాఖలో ఓ వ్యక్తి దొరికిపోయాడు. అతడు చేసిన మోసానికి అధికారులు అవాక్కు అయిపోయారు.

GST Scam in Vizag: ఈ మధ్యకాలంలో సాంకేతిక రంగం చాలా అభివృద్ధి చెందింది. దీంతో పనులు వేగంగా అవ్వడమే కాకుండా ఇంకా టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించి చాలా మంది అక్రమాలకు పాల్పడుతున్నారు. టెక్నాలజీ వస్తే పనుల్లో పారదర్శకత పెరుగుతుందని అనుకుంటే.. అందులోని లూప్ పోల్స్‌ను చాలా మంది పట్టుకుంటున్నారు. దీంతో జీఎస్టీ వసూళ్ల విషయంలో కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. జీఎస్టీ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా విశాఖపట్టణంలో భారీ జీఎస్టీ పన్ను పన్ను ఎగవేత ఒకటి బయటపడింది. నకిలీ ఇన్వాయిస్‌లు సృష్టించి ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టాన్ని మిగిల్చాడు. ఇలా చేసిన వ్యక్తిని కేంద్ర జీఎస్టీ(సీజీఎస్టీ) అధికారులు అరెస్టు చేశారు. అతడిని 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. రూ.11.54 కోట్ల పన్నును ఎగొట్టాడు.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే, విశాఖ నగరానికి చెందిన ఓ వ్యాపారి నకిలీ ఇన్వాయిస్‌లు సృష్టించి ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొడుతున్నాడు. దీంతో ఈ జీఎస్టీ ఎగవేతపై పక్కా సమాచారం అందుకున్న సీజీఎస్టీ యాంటీ-ఎవేషన్ విభాగం అధికారులు నగరంలో సోదాలు నిర్వహించారు. ఈ దర్యాప్తులో వారికి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు చేసిన పనికి వారంతా అవాక్కు అయ్యారు. నిందితుడు ఏకంగా రూ.81.25 కోట్ల విలువైన నకిలీ ఇన్వాయిస్‌లను సృష్టించాడని అధికారులు గుర్తించారు. అతడు చేసిన మోసం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన రూ.11.54 కోట్ల పన్నును ఎగొట్టినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు.

ఈ కేసుకు సంబంధించి నిందితుడి నివాసంతో పాటు సంబంధిత కార్యాలయాల్లో అధికారులు ఏకకాలంలోనే దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో పన్ను ఎగవేతకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎలక్ట్రానిక్ ఆధారాలను సైతం గుర్తించారు. అరెస్టు చేసిన నిందితుడిని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకుంది. ఈ క్రమంలో నిందితుడికి 14 రోజుల రిమాండ్‌ను విధించింది. అలాగే ఈ స్కామ్‌లో ఇంకా మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలోనూ సీజీఎస్టీ అధికారులు విచారణ చేపట్టారు. కేంద్రానికి పన్నులు సంక్రమంగా కట్టాలని జీఎస్టీ అధికారులు సూచిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఇలా పన్నులు, జీఎస్టీని ఎగొట్టాలని ప్రయత్నిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *