పాక్‌లో ఆత్మాహుతి: 8 మంది మృతి


ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని ఖైబర్ పక్తుంఖ్వా పరిధి లక్కీ మార్వాట్ జిల్లాలో ఆత్మాహుతి దాడి మంగళవారం జరిగింది. పేలుడు పదార్థాలతో నిండివున్న వాహనాన్ని డిటోనేట్ చేయడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మందికి గాయాలయ్యాయి. సైనిక కదలికలు ఉన్నప్పటికీ ఆత్మాహుతి దాడి జరగడంతో అంతా ఉలిక్కిపడ్డారు. పేలుడు పదార్థాలతో ఉన్న ఆటో ఒకటి నౌరంగ్ బజార్‌లోని ఫట్టాక్ చౌక్ దూసుకొచ్చి పేలిపోయిందని పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఒక మహిళా అధికారి సహా ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు ఉన్నారన్నారు. క్షతగాత్రుల్ని సరాయ్ నౌరంగ్ పరిధిలోని ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని ఇతర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు పంపారు. అధికారులు స్థానికంగా మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. వైద్యులు, సిబ్బంది సెలవులు రద్దు చేశారు. రెండు రోజుల క్రితం ఒక చెక్‌పోస్ట్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 15 మంది పోలీసులు మరణించిన విషయం తెలిసిందే.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *