కలెక్టర్ కు నివేదిస్తాం.. డి సి హెచ్ ఎస్ మధుసూదన్
విశాలాంధ్ర- ధర్మవరం ; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న పరిపాలన అధికారి పై వచ్చిన ఆరోపణల పై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ అధికారిగా తాను రావడం జరిగిందని డిసిహెచ్ఎస్ మధుసూదన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తీపేంద్ర నాయక్ ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగించడం జరిగిందని తెలిపారు. అనంతరం డిసిహెచ్ఎస్ మధుసూదన్ విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాను ధర్మవరం పట్టణంలో పరిపాలన అధికారిగా ఉంటున్న ఉద్యోగిపై వచ్చిన ఆరోపణలపై, వివిధ దినపత్రికల్లో వచ్చిన కథాంశాలపై విచారణకు రావడం జరిగిందన్నారు. విచారణ అనంతరం నివేదికను జిల్లా కలెక్టర్కు అందజేస్తామని, తదుపరి కలెక్టర్ ద్వారా చర్యలు తీసుకోబడుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ తిపేంద్ర నాయక్, ధర్మవరం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ సంకారపు నరసింహులు, డాక్టర్ సుబ్బారావు, పుల్లయ్య కూడా పాల్గొని, విచారణకు సహకరించారు అని తెలిపారు. తదుపరి సంబంధిత అధికారుల ద్వారా రాతపూర్వకంగా నివేదికను తయారుచేసి, తక్షణమే జిల్లా కలెక్టర్ కార్యాలయమునకు అందజేయడం జరుగుతుందని వారు తెలిపారు.


