తాడిపత్రిలో ఏసీబీ దాడులు: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విఆర్ఓ…


విశాలాంధ్ర-తాడిపత్రి: తాడిపత్రిలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి లంచం తీసుకుంటున్న విఆర్ఓను పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సీఐలు హమీద్ ఖాన్, రామకృష్ణ ఈ విషయాన్ని వెల్లడించారు.బుధవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ—ఆలూరు గ్రామపంచాయతీ పరిధిలోని ఆవుల తిప్పాయపల్లి గ్రామానికి చెందిన రైతు వై. ప్రభాకర్ రెడ్డి భూమి మిగులు భూముల జాబితాలో చేరిందని తెలిపారు. ఈ భూమి పూర్వీకుల నుంచి సంక్రమించిందని రైతు పేర్కొన్నారు.మిగులు భూమి జాబితా నుంచి తొలగించి పాస్‌బుక్‌లో నమోదు చేయడానికి సజ్జలదిన్నె వీఆర్వో, ఆలూరు ఇన్‌చార్జ్ విఆర్ఓ కె. రామకృష్ణ డబ్బులు డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. అనంతరం మధ్యాహ్నం సమయంలో కడప రోడ్డుపై ఉన్న ఓ డాబా వద్ద రైతు నుంచి రూ.30,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతడిని పట్టుకున్నట్లు చెప్పారు.వీఆర్ఓను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు, తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను ఇంకా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం కోరితే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదు దారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు ప్రజలకు సూచించారు.

The post తాడిపత్రిలో ఏసీబీ దాడులు: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విఆర్ఓ… appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *