అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం


విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీతలు మీనుగా గోపాల్, మంగే రమేష్ బాబులను బుధవారం ఉరవకొండలో ఘన సన్మానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బహుజన నాయకుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. దళిత గిరిజనుల హక్కుల సాధన సమితి వ్యవస్థాపకుడు మీనుగా గోపాల్, రాష్ట్ర చర్మకారుల ప్రధాన కార్యదర్శి మంగే రమేష్ బాబులను పూలమాలతో సత్కరించి, శాలువాలు కప్పి, స్వీట్లు పంచి అభినందించారు. సమాజానికి వారు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొంటూ, భవిష్యత్తులో కూడా ప్రజల మధ్య ఉంటూ మరింత సేవ చేయాలని వక్తలు ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధనలో ఇటువంటి సేవాభావం ఉన్న నాయకులు సమాజానికి ఆదర్శమని కొనియాడారు. కార్యక్రమంలో పాల్తూరు ఆనంద్ రాజు, చికలగురికి మరెన్న, లత్తవరం చంద్రశేఖర్, హనుమంతు, రహంతుల్లా, బెంజిమెన్, జగదీశ్, బండారు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చె న్నరాయుడు, మహిపతి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *