తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
హైదరాబాద్ మహానగర పాలనలో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. పాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ను మూడు కార్పొరేషన్లుగా విభజించింది. ఈ మేరకు బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పునర్‌వ్యవస్థీకరించిన జీహెచ్ఎంసీతో పాటు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ , మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో రెండు కొత్త సంస్థలను ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. నగర జనాభా,…


