అమెరికా టీ-20 ప్రపంచకప్ జట్టులో నంద్యాల జిల్లా కుర్రాడు
వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడిన నంద్యాల జిల్లా సంజామల మండలం కలమలపురి గ్రామానికి చెందిన ముక్కమల్ల నాగేశ్వర్ రెడ్డి-లక్ష్మి దంపతుల కుమారుడు ముక్కమల్ల సాయితేజ అంతర్జాతీయ క్రికెట్‌లో మరో కీలక అడుగు వేశాడు.టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో భాగంగా భారత్‌తో జరిగిన పోరులో అమెరికా (యుఎస్‌ఏ) జట్టు తరఫున అతడు మైదానంలోకి దిగాడు.చిన్నతనం నుంచే క్రికెట్‌పై అపారమైన ఆసక్తి కలిగిన సాయితేజ, చదువుతో పాటు హైదరాబాద్‌లోని వీవీఎస్ లక్ష్మణ్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతూ తన ఆటను మెరుగుపరుచుకున్నాడు….


