ఎన్నికల హామీ అమలు – కదిరిగేట్ నిర్వాసితులకు రూ.10.74 కోట్ల చెల్లింపు


మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం:;ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ధర్మవరం ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య , ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతోందని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ధర్మవరం అభివృద్ధికి అత్యంత కీలకమైన కదిరి గేట్ ఫ్లైఓవర్ నిర్మాణం గతంలో జరిగిన నిర్లక్ష్య పాలన కారణంగా నిలిచిపోయిందని తెలిపారు.ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేందుకు మంత్రి సత్య కుమార్ యాదవ్ కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. ఆ హామీ అమలులో భాగంగా 2025–2026 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.10,74,43,588 రూపాయలను నిర్వాసితులకు ప్రభుత్వం జమ చేయడం జరిగిందని తెలిపారు. ఈ మొత్తం (2025–2026): రూ.10,74,43,588 చెల్లింపులతో నిర్వాసితుల సమస్యలు పరిష్కార దిశగా అడుగులు పడగా, ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కూడా వేగవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓబులేష్, సోమ్లా నాయక్, భాస్కర్ రెడ్డి, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *