ఆంధ్రప్రదేశ్ హాకీ ఉపాధ్యక్షులు సూర్యప్రకాష్
విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లా సబ్ జూనియర్ బాలికల హాకీ జట్టు ఎంపిక పోటీలు ఫిబ్రవరి 22వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హాకీ ఉపాధ్యక్షులు, శ్రీ సత్యసాయి జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి బి. సూర్యప్రకాష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఎంపిక పోటీలలో పాల్గొనబోవు సబ్ జూనియర్ క్రీడాకారులు 01-01-2010 తరువాత జన్మించి ఉండాలని,ఎంపికలకు హాజరగు క్రీడాకారులు తమవెంట ఆధార్ కార్డ్,బర్త్ సర్టిఫికెట్ తీసుకురావాలని వారు తెలిపారు. ఈ అవకాశాన్ని బాలికలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.


