గొర్రెల మందపైకి దూసుకెళ్లిన లారీ.. 8 గొర్రెల మృతి


విశాలాంధ్ర, ఉరవకొండ: ఉరవకొండ సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 గొర్రెలు మృతి చెందగా, అనంతరం లారీ డ్రైవర్‌పై గొర్రెల కాపరులు దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.సత్యసాయి జిల్లా రామగిరి గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు గొర్రెల మందను రోడ్డుపై తోలుకుంటూ వస్తుండగా, అనంతపురం నుంచి ఉరవకొండ వైపు టెంకాయల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 8 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి.దీంతో ఆగ్రహానికి గురైన గొర్రెల కాపరులు లారీ డ్రైవర్ తమిళనాడుకు చెందిన గోవిందరాజుపై దాడి చేసి గాయపరిచారు. సమాచారం అందుకున్న ఉరవకొండ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన డ్రైవర్‌ను ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *