ప్రచండ భానుడి దెబ్బకు12 మంది బలి


విశాలాంధ్ర బ్యూరో-ఖమ్మం: ప్రచండ భానుడి ఉగ్రరూపంతో జనం తల్లడిల్లిపోతున్నారు. ఎండల ధాటికి రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు మృత్యువాత పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో మంగళవారం ఒక్కరోజే 12 మంది మృతి చెందారు. కారేపల్లి మండలం రేలకాయలపల్లిలో పంచాయతీ కార్మికుడు వెంకట నరసయ్య (45) విధి నిర్వహణలోనే ఎండ తీవ్రతకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భౌతిక కాయాన్ని సర్పంచ్ తేజవాత్ శిరీష రమేష్ సందర్శించి నివాళులర్పించారు. దుబ్బతండ గ్రామానికి చెందిన బానోతు రమేష్ (39) డోర్నకల్ గ్రామానికి టూ వీలర్‌పై వెళ్లి వస్తూ వడదెబ్బకు గురై మృతి చెందాడు. ఖమ్మం యÖపీహెచ్ కాలనీలో తాపీ పని చేస్తూ బోసిని విజయ అనే మహిళ అస్వస్థతకు గురై మృతి చెందింది. కూసుమంచి మండలం గట్టుసింగారం గ్రామానికి చెందిన దుంపల సాయి (31) అనే కూలీ పనికి వెళ్లి అస్వస్థతకు గురై అశువులుబాసాడు. బోడియ తండాకు చెందిన భూక్య అచ్చమ్మ (70) అనే కూలీ వడదెబ్బకు మంచాన పడి మృతి చెందింది.ఎదులాపురం మున్సిపాలిటీకి చెందిన షేక్ ఇమామ్(45) భానుడి ప్రకోపానికి బలైనట్టు కుటుంబీకులు తెలిపారు. దారేడు గ్రామానికి చెందిన కల్లేపల్లి లక్ష్మి (58) ఎండ వేడికి తట్టుకోలేక మృతి చెందింది. తల్లాడలో బండారు మోహన్ రావు (65), ఖమ్మం ముస్తఫా నగర్ కు చెందిన ప్రైవేటు ఎలక్ట్రిషియన్ ఎస్‌కే సలీం, బోనకల్లుకి చెందిన యాచకుడు, కామేపల్లి మండలం లచ్చ తండాకు చెందిన అజ్మీరీ బాబ్జి (70) వడగాడ్పులకు తట్టుకోలేక మృత్యువాత పడ్డారు. ఇదిలా ఉండగా… ఒక్క వడదెబ్బ కేసు కూడా ప్రభుత్వ జాబితాలో నమోదు కాకపోవడం విశేషం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *