ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా జరిపిన వరుస దాడులలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కార్యాలయం దెబ్బతింది. రష్యా క్షిపణి దాడుల తర్వాత పడిన శకలాలు భవనాన్ని తాకడంతో మూడో అంతస్తులోని కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రేయేసస్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆరోగ్య సేవలు, పౌరులపై దాడులు వెంటనే ఆపాలని ఆయన కోరారు. ఆరోగ్య వ్యవస్థలపై, సామాన్య ప్రజలపై దాడులు వెంటనే నిలిపేయాలి అంటూ ఆయన స్పష్టం చేశారు.
ఐక్యరాజ్యసమితి సంస్థల కార్యాలయాలకూ ముప్పు
ఔHO కార్యాలయం ఉన్న భవనంలో ఐక్యరాజ్యసమితికి చెందిన పలు సంస్థల కార్యాలయాలు కూడా ఉన్నాయని టెడ్రోస్ వెల్లడించారు. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న హింసను ఆపేందుకు మరోసారి కాల్పుల విరమణ అమలు చేయాలని కోరుతూ ఁశాంతియే అత్యుత్తమ ఔషధం అని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే, ఆదివారం రష్యా కీవ్‌పై భారీ స్థాయిలో క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపింది.
ఈ దాడుల్లో కనీసం నలుగురు మరణించగా, నివాస ప్రాంతాలు, ఒక పాఠశాల, వాణిజ్య భవనాలు దెబ్బతిన్నాయి. రష్యా ఆక్రమిత ప్రాంతంలో ఉన్న విద్యార్థుల హాస్టల్‌పై ఉక్రెయిన్ దాడి చేసి 18 మంది చనిపోయారని మాస్కో ఆరోపించిన నేపథ్యంలో ఈ ప్రతీకార దాడులు జరిగినట్లు తెలుస్తోంది.


