. రూపాయితోపాటు మోదీ గ్రాఫ్ పతనం
. ఈయూ, అమెరికాతో ఒప్పందాలు భారత్‌కే నష్టం
. ఎన్డీఏ పాలనలో అప్ప్పులపాలైన దేశం
. సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాల్లో రామకృష్ణ
. ఎలాంటి పోరాటానికైనా రైతులు సిద్ధం: వెంకయ్య
. సమస్యను గాలికొదిలేసి లడ్డూ రాజకీయం
. మత విభజన రాజకీయాలపై పోరాడతాం
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య
విశాలాంధ్ర బ్యూరో – కాకినాడ : ఆరఎసఎస్, బీజేపీ, ప్రాని మోదీకి వ్యతిరేకంగా పోరాడటానికి సరైన తరుణమిదేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. దేశంలో దశాu్దకాలంగా పాలనలో ఉన్న మోదీ గ్రాఫ్ పడిపోయిందని, దేశవ్యాప్తంగా ఆయన పట్ల వ్యతిరేకత పెరిగిందని, మేధావులు, లౌకిక, ప్రజాస్వామ్యవాదులు ఏకతాటిపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారని, మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి విస్తత, బలమైన పోరాటాలు నిర్వహించడానికి సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి సమావేశాలు మంగళవారం కాకినాడలో ప్రారంభమయ్యాయి. పార్టీ కార్యదర్శివర్గసభ్యులు తాటిపాక మధు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాలకు ముఖ్యఅతిథిగా రామకష్ణ హాజరై… అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై ప్రసంగించారు. ప్రపంచ దేశాలపై అమెరికా ఆధిపత్యం విచ్చలవిడిగా పెరిగిందని, వెనిజులా, క్యూబా, పలస్తీనా, ఇరాన్ దేశాలపై అనుసరిస్తున్న దురాక్రమణ విధానాలే ఇందుకు సాక్ష్యమని అన్నారు. అమెరికా చర్యలను ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాలు ఖండించినా… భారత్ మాత్రం నోరుమెదపడం లేదని, భారత ప్రతిష్ట దెబ్బతినేలా మోదీ విదేశాంగ విధానం ఉందని విమర్శించారు. యూరోపియన్ యూనియన్, అమెరికాతో ఇటీవల మోదీ ప్రభుత్వం చేసుకున్న వాణిజ్య ఒప్పందాలు భారత్‌కు నష్టదాయకమని అన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ పాలనలో భారతదేశం పూర్తిగా అప్ప్పులపాలైపోయిందని, భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి 2014 వరకు 55 లక్షల కోట్ల రూపాయలు అప్ప్పు ఉండగా… మోదీ 11 ఏళ్ల పాలనలో ఈ అప్ప్పు 214 కోట్ల రూపాయలకు పెరిగిందని చెప్పారు. కార్పొరేట్లకు ప్రభుత్వ ఆస్తులు దోచిపెడుతున్న మోదీ… చివరకు దేశాన్నే అమ్మకానికి పెట్టేశారని, దేశ చరిత్రలో ఏనాడూ ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి నెలకొనలేదని విమర్శించారు. సమస్యలన్నింటినీ పక్కనబెట్టి మత ఎజెండాతో ముందుకుపోతున్న మోదీ సర్కారు ఎన్నికల సంఘం, ఈడీ, సీబీఐతో పాటు చివరకు సుప్రీంకోర్టును సైతం తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి కుట్ర పన్నుతోం దని ఆరోపించారు. జీ రామ్ జీ పథకంలో ఉపాధి హక్కుకే ముప్ప్పు ఏర్పడిందని, ఎన్నికలను దష్టిలో పెట్టుకొని ఎసఐఆర్‌తో లక్షలాది ఓట్ల తొలగింపునకు పూనుకుంటు న్నారని అన్నారు. ప్రతి ఆఫీసులోనూ ఒక ఆరఎసఎస్ కార్యకర్తను గూఢచారిగా పెట్టుకున్న బీజేపీ ప్రభుత్వం… ప్రత్యేక రహస్య ఎజెండాతో పాలిస్తున్నదన్నారు. రూపాయి పతనంతోపాటు మోదీ గ్రాఫ్ కూడా పూర్తిగా పడిపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో లడ్డూ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయని, పవన్ కల్యాణ్ పక్కా అవకాశవాదిగా మారిపోయారని అన్నారు. టీడీపీ, జనసేనతోపాటు వైసీపీ సైతం మోదీకి మోకరిల్లుతోందని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో భావసారూప్య పార్టీలతో కలిసి పోరాటాలు నిర్మించాలని, అందుకోసం ఈ కౌన్సిల్ సమావేశాలు సరైన చర్చా వేదికగా మారాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.
ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలతో అన్నదాత పరిస్థితి దారుణంగా మారిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. నాలుగు కార్మిక కోడ్ల రద్దుకు కార్మికవర్గంతో కలిసి రైతులంతా పోరాటానికి దిగారని, వారిలో అసంతప్తి పెరగడానికి ఇంతకుమించిన ఉదాహరణ ఉండదని అన్నారు. ఉపాధి హామీ చట్టం రద్దుచేసి… జీ రామ్ జీ చ{్టం తీసుకువచ్చిన ప్రభుత్వం గ్రామీణ ఉపాధి రంగంతోపాటు వ్యవసాయ రంగాన్ని కుదేలు చేయడానికి కంకణం కట్టుకున్నదన్నారు. అసంతప్తితో రగిలిపోతున్న రైతులు ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నారని వెంకయ్య చెప్పారు.
చాపకింద నీరులా ఆరఎసఎస్
భావజాలం: ఈశ్వరయ్య
ఏపీ చరిత్రలోనే తొలిసారిగా ఆరఎసఎస్ మతోన్మాద భావజాలం చాపకింద నీరులా ఇంటింటికీ చేరుతోందని, ఇది అత్యంత ప్రమాదకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య హెచ్చరించారు. కాకినాడలో ప్రారంభమైన సీపీఐ కౌన్సిల్ సమావేశాల్లో ఈశ్వరయ్య రాజకీయ, నిర్మాణ, కార్యకలాపాల నివేదిక ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయం లడ్డూ చుట్టూ తిరుగుతోందని, కూటమి పక్షాలు తమ రాజకీయ గ్రాఫ్ పెంచుకోవడం, అసలు సమస్యలను పక్కకు నెట్టేయడమే ఈ లడ్డూ రాజకీయ లక్ష్యమని వ్యాఖ్యానించారు. ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో మత విభజన రాజకీయాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పార్టీ కార్యకర్తలు ఆర్థిక, రాజకీయ పోరాటాలతోపాటు ప్రమాదకరమై ఆరఎసఎస్ భావజాలానికి వ్యతిరేకంగా శాస్త్రీయ విశ్లేషణ, అవగాహన పెంచేందుకు కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. ఆంధ్రాలో యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ కోసం పవన్ కల్యాణ్ తహతహలాడుతున్నారని, ఇంకోవైపు ప్రభుత్వ అధ్వర్యంలో భూముల అమ్మకాలు యధేచ్ఛగా సాగిపోతున్నాయని అన్నారు. ఎమ్మెల్యేల్లో అవినీతి విచ్ఛలవిడిగా పెరిగిపోయిందని, వీటన్నింటినీ దష్టిలో పెట్టుకొని కూటమి విధానాలకు వ్యతిరేకంగా లౌకిక, ప్రజాస్వామికవాదులతో కలిసి పోరాటాలు రూపకల్పన చేయాలని ఈశ్వరయ్య పిలుపునిచ్చారు.
సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో ముందుగా సంతాప తీర్మానాన్ని కార్యదర్శివర్గ సభ్యులు కేవీవీ ప్రసాద్ ప్రవేశపెట్టగా, సభ్యులు రెండు నిమిషాలపాటు మౌనం పాటించి అమరవీరులకు నివాళులర్పించారు. ప్రారంభ కార్యక్రమంలో వేదికపై జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, ముప్పాళ్ళ నాగేశ్వరరావుతోపాటు జాతీయ సమితిసభ్యులు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఆశీనులయ్యారు. ఈ సమావేశాలు రెండోరోజు బుధవారం కూడా కొనసాగుతాయి.
The post మోదీపై పోరుకు తరుణమిదే! appeared first on Visalaandhra.


