హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి
విశాలాంధ్ర ధర్మవరం;; ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా ధర్మవరం పట్టణంలోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ పురపాలక బాలికల ఉన్నత పాఠశాలలో విజయదుందుభి మోగించి పట్టణ ప్రధమ కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం 500 మార్కులు పైగా వచ్చిన 71 మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులను ఘనంగా సన్మానిస్తూ, ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. అనంతరం హెడ్మాస్టర్ మాట్లాడుతూ ఇటువంటి పరీక్ష ఫలితాలు జిల్లా స్థాయికే తార్కానము అని తెలిపారు. డీఈవో, ఎంఈఓ, మున్సిపల్ కమిషనర్, మంత్రి సత్య కుమార్ యాదవ్, మంత్రి పిఏ హరీష్ బాబు తదితరుల చేత చక్కటి అభినందన పొందడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్, పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
The post పది పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఘనసన్మానం appeared first on Visalaandhra.


