విశాలాంధ్ర ధర్మవరం ; కరాటే లో సరికొత్త చరిత్ర సృష్టించడం జరిగిందని కరాటే అకాడమీ నిర్వాహకులు శిరిపి వెంకటేష్ తెలిపారు. వారు మాట్లాడుతూ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ‘లార్జెస్ట్ కరాటే డిస్ప్లే’ కార్యక్రమంలో సిరిపి వెంకటేష్ కరాటే అకాడమీ విద్యార్థులు సరికొత్త చరిత్ర సృష్టించడం ఎంతో సంతోషించదగ్గ విషయమని తెలిపారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లక్ష్యంగా నిర్వహించిన ఈ భారీ ప్రదర్శనలో మాస్టర్ సిరిపి వెంకటేష్ సారథ్యంలో 13 మంది విద్యార్థులు అత్యంత క్రమశిక్షణతో పాల్గొని తమ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలను ప్రదర్శించారు అని తెలిపారు. మొత్తం 14 మంది సభ్యులతో కూడిన ఈ బృందం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించి, అకాడమీ కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు అని తెలిపారు. ఏప్రిల్ 26న జరిగిన ఈ అద్భుత ఘట్టంలో పాల్గొని, తమ అకుంఠిత దీక్షతో ఈ విజయాన్ని సాధించిన విద్యార్థులను మాస్టర్ వెంకటేష్‌ను పలువురు ప్రముఖులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి కరాటే మాస్టర్ వెంకటేష్ కూడా ఆ 13 మంది విద్యార్థులను అభినందించారు.


