విశాలాంధ్ర ధర్మవరం; ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకల్లో భాగంగా చేనేత క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్ తెలుగుదేశం పార్టీ నాయకులు సంధ్యా రాఘవ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణములో జరిగిన పోటీల్లో హిందూపురం జట్టు విజయం సాధించిందని నిర్వాహకులు తెలిపారు. విన్నర్ కు కప్పుతో పాటు ఒక లక్ష పదివేల రూపాయలు ధర్మవరం కు రావడం జరిగిందని, రన్నర్ జట్టుకు 50 వేల రూపాయలు, మిగతా ప్రతిభ చూపిన వారికి రెండు జట్లకు పదివేల రూపాయలు ఐదువేల రూపాయలు చొప్పున ప్రోత్సాహక బహుమతులను సంధా రాఘవ సందా రవి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా క్రీడాకారులు తమ హర్షమును వ్యక్తం చేశారు.


