ఏఐటీయూసీ రాష్ట్ర 18 వ మహాసభలను జయప్రదం చేయండి


రుపతికి వేలాదిగా తరలిరండి

కార్మికుల హక్కుల రక్షణ కోసం మహాసభ వేదికగా ఉద్యమ రూపకల్పన

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు లు పి హరినాథ్ రెడ్డి

ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. 26వ తేదీ తిరుపతిలో జరిగే కార్మిక మహా ప్రదర్శన, భారీ బహిరంగ సభకు రాష్ట్ర నలువైపుల నుండి వేలాదిగా తరలి రావాలని కోరారు. మహాసభ జయప్రదం కోసం బుధవారం సాయంత్రం తిరుపతి సిపిఐ కార్యాలయంలో నగర ముఖ్య నాయకుల సమావేశం ఎన్ డి రవి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న తీరును కార్మిక లోకం ఎండ కట్టాలి అన్నారు. స్వాతంత్రానికి పూర్వం పోరాడి సాధించుకున్న చట్టాలను నరేంద్ర మోడీ హరించి వేస్తున్నారని ధ్వజమెత్తారు. పెట్టుబడిదారులకు ఊడిగం చేసే పనిలో భాగంగా 29 కార్మిక చట్టాలను రద్దుచేసి 4 లేబర్ కోడ్ లుగా మార్చడం దారుణం అన్నారు. ఫిబ్రవరిలో జరిగిన సార్వత్రిక సమ్మెలో కోట్లాదిమంది కార్మికులు పాల్గొన్నప్పటికీ నరేంద్ర మోడీకి చీమకుట్టినట్టు కూడా లేదు అన్నారు. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలకడం దానడం అన్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో ఈనెల 26 నుండి మూడు రోజులపాటు జరగనున్న ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించడం జరుగుతుందన్నారు. భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ మహాసభలో విజయవంతానికి జిల్లా ఏఐటియుసి నాయకత్వంతో పాటు తిరుపతి నగర పార్టీ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న 600 మంది ప్రతినిధులకు వసతి మొదలు భోజనాల వరకు ఎటువంటి లోటు లేకుండా చూడాలి అన్నారు. ప్రధానంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను క్రోడీకరించి నగరంలో బ్యానర్లు కటౌట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే నగరాన్ని తోరణాలతో సుందరంగా అలంకరించాలని పేర్కొన్నారు.

ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగ సుబ్బారెడ్డి మాట్లాడుతూ 26వ తేదీ తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుండి ఇందిరా మైదానం వరకు వేలాది మంది కార్మికులతో మహాప్రదర్శన నిర్వహించడం జరుగుతుందన్నారు. 27 28 తేదీలలో జరిగే ప్రతినిధుల సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా 600 మంది హాజరవుతున్నారని పేర్కొన్నారు. మహాసభల విజయవంతం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చురుగ్గా చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి, నగర కార్యదర్శి విశ్వనాథ్, ఏఐటియుసి అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, రాధాకృష్ణ, నగర అధ్యక్షుడు శివ తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *