ఠారెత్తించిన ఎండలు.. తెలంగాణలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి!


తీవ్రమైన ఎండలతో తెలంగాణ రాష్ట్రం అగ్నిగోళంలా మారింది. ముఖ్యంగా ఏడు జిల్లాల్లోని 20 మండలాలు వడగాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్‌ మండలం తీవ్రంగా వేడెక్కగా, అదే జిల్లాలో దహేగాం, సిర్పూర్‌(యు) మండలాల్లో కూడా వడగాలులు నమోదయ్యాయి.ఆదిలాబాద్ జిల్లాలో మూడు మండలాలు, కామారెడ్డి జిల్లాలో రెండు, నిర్మల జిల్లాలో రెండు, నిజామాబాద్ జిల్లాలో మూడు, రంగారెడ్డి జిల్లాలో మూడు, సిద్దిపేట్ జిల్లాలో నాలుగు మండలాల్లో వడగాలులు తీవ్రంగా వీచాయి.

దస్తురాబాద్‌లో అత్యధిక ఉష్ణోగ్రత
రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత దస్తురాబాద్‌లో నమోదైంది. అక్కడ 44.5 డిగ్రీల సెల్సియస్‌ తాపన నమోదైంది.ఆదిలాబాద్ అర్బన్, మడుగులపల్లిలో 44.4 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక సిర్‌పూర్ (టి), భీమారం, ముప్కల్ మండలాల్లో 44.3 డిగ్రీలు నమోదయ్యాయి.అలాగే ఇబ్రహీంపట్నం, కన్నాయిగూడెం, అక్బర్‌పేట-భూంపల్లి మండలాల్లో 44.2 డిగ్రీలు నమోదయ్యాయి.జమ్మికుంటలో 44.1 డిగ్రీలు, రామగుండంలో 44 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. మిగిలిన 22 జిల్లాల్లో 42 నుంచి 43.9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఇక శని, ఆదివారాల్లో ఉష్ణోగ్రతలు మరో 1 నుంచి 2 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరగనున్నట్లు స్పష్టమవుతోంది.

The post ఠారెత్తించిన ఎండలు.. తెలంగాణలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి! appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *