ప్రగతి పథంలో ఏపీ – Visalaandhra


. తలసరి ఆదాయం రూ.2.95 లక్షలకు పెరుగుదల
. వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో అనూహ్య వద్ధి
. శరవేగంగా అమరావతి రాజధాని నిర్మాణం
. గవర్నర్ అబ్దుల్ నజీర్

న్యూదిల్లీ: సార్వత్రిక సమ్మెకు సర్వం సిద్ధమైంది. పది కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల అధ్వర్యంలో గురువారం 24 గంటల పాటు నిరసనలతో దేశం మార్మోగబోతోంది. ధర్నాలు, ప్రదర్శనలతో దేశవ్యాప్త సమ్మె పెద్దఎత్తున జరగబోతోంది. నాలుగు కార్మిక కోడ్‌లు, అమెరికా`భారత్ వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు పోరుబాట పట్టారు. ఐక్యంగా సమ్మెకు సమాయత్తమయ్యారు. పోరాడి సాధించుకున్న తమ హక్కులను కాలరాసేందుకు, వ్యవసాయ రంగానికి హాని చేసేందుకు తీసుకొచ్చే విధానాలను, చట్టాలను ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ… వాటి రద్దునకు సర్కారుపై ఒత్తిడి పెంచేందుకు ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటోందన్నారు. ఏడాదికి రూ.33 వేల కోట్లతో సూపర్ సిక్స్ సహా ఇతర డీబీటీ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. 63.12 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు చేకూరుతున్నట్లు తెలిపారు. 66 లక్షల మందికి పైగా విద్యార్థులకు తల్లికి వందనం అందుతోందన్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం, అన్నదాత సుఖీభవ ద్వారా రూ.20 వేలు చొప్ప్పున 46.86 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతోందని గవర్నర్ తెలిపారు. దీపం 2.0 పథకం ద్వారా 1.08 కోట్ల మంది పేద కుటుంబాలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు. మెగా డీఎస్సీ ద్వారా 15,941 పోస్టుల భర్తీతో పాటు 5,757 మంది కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. మత్స్యకార సేవలో పథకం ద్వారా 1.2 లక్షల మందికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందుతోందని తెలిపారు. లక్ష మందికి పైగా హ్యాండ్లూమ్, పవర్‌లూమ్‌లపై ఆధారపడిన చేనేత కుటుంబాలకు 200, 500 యూనిట్లు చొప్ప్పున ఉచిత విద్యుత్ అందిస్తోందని గవర్నర్ చెప్పారు. విభజన తర్వాత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గత పాలకులు ధ్వంసం చేశారన్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులు పెరిగాయని, శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా పాలించారని, 22ఏ అధికరణను దుర్వినియోగం చేశారన్నారు. మౌలిక వసతులైన విద్యుత్, సాగునీరు, రహదారులు లాంటి రంగాల్లో అభివృద్ధి కుంటుపడిందని గవర్నర్ తెలిపారు.స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో కూటమి పాలన సాగుతుందని, పది సూత్రాలను నిర్దేశించుకుని ప్రజలకు సుపరిపాలన అందించేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ప్రతి కుటుంబానికి ప్రయోజనాలను అందిస్తున్నామన్నారు. త్వరలో ఫ్యామిలీ కార్డు అందించే ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. పీ4 ద్వారా పేద, ధనిక వర్గాల మధ్య తారతమ్యాలను తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 113 నియోజకవర్గాల్లో 205 అన్న క్యాంటీన్లT ఏర్పాటు చేసిందని, మిగిలిన నియోజకవర్గాల్లోనూ గ్రామీణ అన్న క్యాంటీన్లT ఏర్పాటు చేయనున్నదన్నారు. గృహ నిర్మాణ పథకాన్ని ప్రభుత్వం చేపడుతోందని అన్నారు. గిరిజన ప్రాంతాలాభివృద్ధికి ప్రాధాన్యత కల్పించేందుకు కృషి చేస్తోందని చెప్పారు. ఎంసఎంఈల ద్వారా బీసీ వర్గాలను బలోపేతం చేసేందుకు కార్యాచరణ చేపట్టిందన్నారు. మైనారిటీలకు భద్రత, వారికి అభివృద్ధిలో భాగస్వామ్యం, విద్య, ఆర్థిక సహకారంతో మేలు చేకూరుస్తోందని తెలిపారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ చెప్పారు. ఐటీ, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో రాష్ట్రం దూసుకెళ్తోందన్నారు. ప్రముఖ పరిశ్రమల భాగస్వామ్యంతో అంతర్జాతీయ గుర్తింపు వస్తోందన్నారు. సుస్థిర పాలనతో అంతర్జాతీయ సంస్థలన్నీ ఏపీని పెట్టుబడులు, నాలెడ్జ్ ఎకానమీకి గమ్యస్థానంగా ఎంచుకున్నాయన్నారు. సంజీవని కార్యక్రమం ద్వారా ప్రజల ఆరోగ్య భద్రతను బలోపేతం చేస్తోందన్నారు. యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా కల్పించేందుకు, ప్రతి వ్యక్తికి రూ.2.5 లక్షల వరకూ సమగ్ర ఆరోగ్య బీమా కల్పించేందుకు ప్రభుత్వం పని చేస్తోందన్నారు. 1.43 కోట్ల పేద కుటుంబాలకు రూ.25 లక్షల వరకు నగదురహిత వైద్యం అందుబాటులోకి తీసుకువస్తోందని అన్నారు. కేన్సర్ సహా ఇతర ఖరీదైన చికిత్సలకు పరిమితి లేకుండా ఈ పథకాన్ని చేపడుతోందని చెప్పారు. అక్రమ మద్యం తయారీ నుంచి విముక్తికి, గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. యువతకు నైపుణ్య శిక్షణతో మెరుగైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. గ్రామాల్లో ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యతిస్తోందన్నారు. ‘వీబీ జీ రామ్ జీ’ పథకం ద్వారా ఉపాధి రోజులను 125 రోజులకు పెంచారన్నారు. అభివృద్ధి వ్యూహంలో మహిళలే కేంద్ర బిందువులని, ఆర్థిక భాగస్వాములు, స్వయం పేరుతో డ్వాక్రా మహిళలఉత్పత్తులకు బ్రాండింగ్ చేస్తోందన్నారు.
వచ్చే ఏడాది 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుందని తెలిపారు. అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. చివరిగా సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు చెప్పిన ‘దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయే’ సూక్తిని వివరిస్తూ సంపన్నమైన, ఆరోగ్యవంతమైన, ఆనందమయమైన ప్రదేశంగా, దేశంలోనే అత్యుత్తమ నివాసయోగ్యమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సాగుతున్న మహత్తర పరివర్తన యజ్ఞంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం వహించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *