–అద్నాన్ సమీతో ఫోన్ చేయడం దేశ వ్యతిరేక చర్యే
ముంబై : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ( ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ పై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీతో కలిసి భోజనం చేయడంపై కాంగ్రెస్ పార్టీ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని దేశ వ్యతిరేక చర్యగా అభివర్ణించింది. అద్నాన్ సమీ తండ్రి హర్షత్ సమీ ఖాన్.. పాకిస్తాన్ వైమానిక దళములో పైలట్ గా పనిచేసిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తు చేసింది. 1965లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో హర్షత్ సమీ పాల్గొన్నారు. పఠాన్ కోట్ సైనిక స్థావరంపై జరిగిన దాడిలోనూ అతని పాత్ర ఉందని పేర్కొంది. అటువంటి అతని కుమారుడైన అద్నాన్ తో మోహన్ భగవత్ భోజనం చేశారు అంటూ కాంగ్రెస్ ఎక్స్ వేదికగా విమర్శించింది. ఇలాంటి పనులు చేసి దేశానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని శివసేన యుబిటి) నేత సంజయ్ రౌత్ ప్రశ్నించారు. కాగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో భాగవతతో కలిసి భోజనం చేస్తున్న ఫోటోలను అద్నాన్ సమీ ఎక్స్ లో పంచుకున్నారు.


