విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా ) :- మండల కేంద్రంలోని సహకార సొసైటీ ఆవరణంలో జరిగిన అభివృద్ధి పనులను గురువారం అసిస్టెంట్ రిజిస్ట్రార్ రవి పరిశీలించారు. సొసైటీ చైర్మన్ ఉమామహేశ్వర్ నాయుడుతో కలిసి ఆయన పనుల పురోగతి, నాణ్యతను పరిశీలించారు.ఇటీవల సొసైటీలో నిర్వహించిన పలు పనుల్లో సుమారు రూ.50 లక్షల మేర అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. అయితే పాలకులు, అధికారులు ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు.పరిశీలన అనంతరం పనుల నాణ్యత, నిర్వహణ పట్ల అసిస్టెంట్ రిజిస్ట్రార్ రవి సంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలతో నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ సిబ్బంది,ఇతరులు పాల్గొన్నారు.


