విశాలాంధ్ర ధర్మవరం:: వృత్తి విద్యా కోర్సులు విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పద్మశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా ఒకేషనల్ విద్యార్థులు సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో 10 రోజులు ఇంటర్సిప్ కార్యక్రమం జరిగిందన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ పద్మశ్రీ మాట్లాడుతూ ఇది పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లను త్వరలో పంపిణీ చేస్తామని తెలిపారు. పట్టణంలోని సంజయ్ నగర్ లో గల ఇంటర్ షిప్ ప్రాంతాన్ని సందర్శించి, అక్కడ గల శ్రీ లక్ష్మీ కంప్యూటర్ ఎంబ్రా డైరీ, హైటెక్ టైలర్ షాప్ లలో ప్రయోగాత్మకంగా చూపించడం జరిగిందన్నారు. విద్యార్థులకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, షర్ట్ స్టిచ్చింగ్, బ్లౌజు, డ్రెస్సు స్టిచ్చింగ్ నేర్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒకేషనల్ ట్రైనర్ చైతన్య లక్ష్మి, జిల్లా కోఆర్డినేటర్ నరేంద్ర, నరసింహమూర్తి పాల్గొన్నారు.


