ఉద్దేశ పూర్వకంగా అలా అనలేదు


క్షమాపణలు చెప్పిన ‘ఉస్తాద్ భగత్ సింగ’ విలన్ పార్తిబన్

హైదరాబాద్: ‘ఉస్తాద్ భగత్ సింగ’ ఈవెంట్‌లో తన మాటల్లో దొర్లిన పదాలపై చిత్రంలో విలన్‌గా నటించిన నటుడు, దర్శకుడు పార్తిబన్ క్షమాపణలు చెప్పారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పార్తిబన్ మాట్లాడిన స్పీచ్‌పై విమర్శలు వచ్చాయి. తనను తాను వేదికపై పరిచయం చేసుకుంటూ కులం పేరును ప్రస్తావించారు. అలా మాట్లాడినందుకు క్షమాపణలు చెబుతూ తాజాగా పోస్ట్ పెట్టారు.‘నేను తప్ప్పు చేస్తే వెంటనే సరిదిద్దుకునే వ్యక్తిని. నిజం చెబుతున్నాను… ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదు. నేను కులవ్యవస్థను తప్ప్పుపడుతూ ఎన్నో సినిమాలు చేశాను. అలాంటి నేను ఉద్దేశపూర్వకంగా ఎందుకు మాట్లాడతాను. అనుకోకుండా తప్ప్పు జరిగింది. స్పీచ్ మధ్యలో నోరు జారాను. ఇన్నేళ్ల నా అనుభవంలో ఇలా కులం పేరు ప్రస్తావించడం ఇదే తొలిసారి. మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడతాను’ అని పార్తిబన్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఇక విడుదలకు సిద్ధమైన ‘ఉస్తాద్ భగత్ సింగ’ సినిమా సూపర్‌హిట్ కావాలని కోరుకుంటూ సెలబ్రిటీలు పోస్ట్‌లు పెడుతున్నారు. రేపు బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయమంటూ ఎక్స్ వేదికగా టీమ్‌కు అభినందనలు తెలుపుతున్నారు.

The post ఉద్దేశ పూర్వకంగా అలా అనలేదు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *