వాషింగ్టన్: పశ్చిమాసియాలో అంతకంతకూ యుద్ధం తీవ్రమవుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన యూరోపియన్ మిత్రదేశాలపై నిప్పులు చెరిగారు. నార్త్ అట్లాంటిక్ ట్రెటీ ఆర్గనైజేషన్ (నాటో) భవిష్యత్తుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ… ప్రస్తుత పరిస్థితి చాలా దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇరాన్ అడ్డంకుల వల్ల మూతపడిన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు తమతో కలిసి రావాలని నాటో కూటమిని ఆయన డిమాండ్ చేశారు. హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు పొందుతున్న దేశాలు తమ సొంత నౌకల రక్షణ కోసం ముందుకు రాకపో వడాన్ని ట్రంప్ తప్పుబట్టారు. “అందరి కోసం అమెరికా ఒక్కటే కాపలా కాయలేదు. ఈ కీలక మార్గాన్ని తెరిపించేం దుకు జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు తమ యుద్ధనౌకలను పంపించాలి. నాటో దేశాలు తమ బాధ్యతను నెరవేర్చకుంటే ఆ కూటమి భవిష్యత్తు ప్రశ్నార్థకమే” అని ఆయన హెచ్చరిం చారు. మరోవైపు, ఇరాన్‌పై అమెరికా జరిపిన బాంబు దాడులను ట్రంప్ సమర్థించుకున్నారు. చమురు సరఫరాను అడ్డుకుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని, దానిని అడ్డుకోవడానికి ఎంతటి కఠిన నిర్ణయాలకైనా వెనకాడబోమని చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలతో నాటో కూటమిలో ఒక్కసారిగా కలకలం రేగింది. పశ్చిమాసియా యుద్ధంలో నేరుగా పాల్గొనడానికి యూరోపియన్ దేశాలు మొగ్గు చూపకపోవడంతో, అమెరికా, దాని మిత్రదేశాల మధ్య దూరం పెరుగుతోందనే చర్చ మొదలైంది.
The post నాటో దేశాలకు ట్రంప్ హెచ్చరిక appeared first on Visalaandhra.


