విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పొరపాలక సంఘ కార్యాలయంలో ఈ నెల 16వ తేదీన సాధారణ కౌన్సిల్ సమావేశమును నిర్వహిస్తున్నట్లు కమిషనర్ వెంకటరమణయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సమావేశం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు. కావున కౌన్సిలర్లు, కార్యాలయ అధికారులు, వైస్ చైర్మన్ లు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.


