అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై. మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర,ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అత్యంత వెనకబడిన అనంతపురం జిల్లాకు ఆర్డిటి లాంటి స్వచ్ఛంద సంస్థల యొక్క సేవలు ఎంతైనా అవసరమని డిసిసి అధ్యక్షులు వై. మధుసూదనారెడ్డి తెలిపారు. ఆర్డిటి సంస్థను రక్షించాలని ఫారిన్ రెగ్యులరైజేషన్ యాక్ట్ (ఎఫ్ సి ఆర్ ఏ) పునరుద్ధరించాలని కోరుతూ సోమవారం అఖిలపక్ష పార్టీలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఉరవకొండలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న డిసిసి అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాలుగా పేదలకు సేవలందిస్తున్న ఆర్డిటి సంస్థపై ప్రతికూల చర్యలను ఆపాలన్నారు. ఆర్ డి టి సంస్థను కాపాడుకోవడానికి జిల్లాలో ప్రజలు, ప్రజా సంఘాలు, అఖిలపక్ష పార్టీలు ఐక్యంగా పని ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్డిటి సంస్థ ఉమ్మడి అనంతపురం జిల్లాలలోని ప్రతి ఇంటితో మమేకమై విద్య, వైద్యం, మరియు అభివృద్ధి కార్యక్రమాలను అందిస్తోందని తెలిపారు. ఆర్డిటి సంస్థకు సంబంధించిన ఎఫ్సిఆర్ఏ నిబంధనలను సడలించి, దాని సేవలు యథావిధిగా కొనసాగించాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
The post అనంతపురం జిల్లాకు ఆర్డిటి సేవలు అవసరం appeared first on Visalaandhra.


