ప్రతి గడపలో కనిపించే ఆర్డిటిని కాపాడాలి – అఖిలపక్ష కమిటీ పిలుపు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎన్జీవోమ్ నందు అఖిలపక్ష కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో “ఆర్డిటిని రక్షించుకుందాం – ఆర్డిటిని దూరం చేయకండి”అనే నినాదంతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అఖిలపక్ష కమిటీ సభ్యులు, నాయకులు మాట్లాడుతూ, ఆర్డిటి సంస్థ పేదవాడి గుండె చప్పుడు,అనంత ప్రజల జీవనాడిగా మారిందన్నారు. సంవత్సరాలుగా అనంతపురం , పుట్టపర్తిజిల్లాలో ప్రజలతో మమేకమై సేవలందిస్తున్న ఆర్డిటి సంస్థ ప్రతి ఇంటిలోనూ,ప్రతి గడపలోనూ కనిపించే స్థాయికి చేరుకుందని తెలిపారు. అయితే అలాంటి సేవా సంస్థకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసంఘాలు, దళిత గిరిజన సంఘాలు,బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు ఆర్డిటి సంస్థను తప్పనిసరిగా కాపాడుకుంటామని వారు స్పష్టం చేశారు.ఆర్డిటి సంస్థను దూరం చేసే ప్రయత్నాలను ఖండిస్తూ,ఆర్డిటి సంస్థకు ప్రజల సంపూర్ణ మద్దతు ఉంటుందని మీడియా ద్వారా తెలియజేశారు.


