ఖాట్మండు: నేపాల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆరఎస్పీ) చరిత్ర సష్టించబోతోంది. చారిత్రక గెలుపు దిశగా దూసుకెళుతోంది. 94 నియోజక వర్గాల్లో ఆరఎస్పీ ఆధిక్యత సాధించింది. నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్యూఎంఎల్ను వెనకు నెట్టి సింగిల్ మెజారిటీ పార్టీగా ఆవిర్భించబోతోంది. మధ్యాహ్నం వరకు నేపాలీ కాంగ్రెస్ ఒక చోట గెలిచింది. మరో 10 స్థానాల్లో ముందంజలో ఉన్నది. ఏడు చోట్ల సీపీఎన్ యూఎంఎల్ ఆధిక్యంలో ఉన్నది. ఇటీవల వరకు ఖాట్మండు మేయర్గా ఉన్న బాలేంద్ర షా ఝాపా5 నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు. నాలుగు సార్లు ప్రధాని, సీపీఎన్యూఎంఎల్ చైర్మన్ కేపీ ఓలీపై ఆధిక్యత సాధించారు. ఝాపా`5 ఓలీ కుంచు కోట అయినప్పటికీ బాలేంద్ర కంటే ఆయనకు ఓట్లు తగ్గాయని సమాచారం. మొత్తం 165 స్థానాలకుగాను 67 పార్టీల తరపున అభ్యర్థులు పోటీ చేశారు.
నిశితంగా గమనిస్తున్న భారత్
నేపాల్ పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి ఱనధీర్ జైశ్వాల్ వెల్లడించారు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధమన్నారు. రెండు దేశాల బంధాన్ని పటిష్ఠం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. నేపాల్ శాంతి, ప్రగతి, సుస్థిరతనే భారత్ కోరుకుంటుందని అన్నారు.


