( విశాలాంధ్ర) వత్సవాయి : బిసి సంక్షేమ శాఖ మంత్రి సవిత చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు, ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు బొగ్గవరపు వెంకట రాజారావు ను సన్మానం చేశారు. స్థానిక వత్సవాయి గ్రామంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాల సందర్శనార్థం విచ్చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య సమక్షంలో అతి కొద్ది సమయంలో సుమారు నాలుగు లక్షల రూపాయల విలువైనటువంటి వసతులు సమకూర్చినటువంటి దాత ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు బొగ్గవరపు వెంకట రాజారావుకు పుష్పగుచ్చాలు అందజేసి శాలువ కప్పి సన్మానించడం జరిగినది ఈ సందర్భంగా మంత్రి సవిత, తాతయ్య రాజారావు నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాలపై సంతోషం వ్యక్తం చేసి భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉపయోగకరమైన సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు….. వత్సవాయి మండలంలోని కాకుండా జిల్లాలో కూడా ప్రముఖ పారిశ్రామికవేత్త బొగ్గవరపు రాజారావు సేవా దృక్పథంపై పలుమార్లు వినడం జరిగిందని నిస్వార్ధంగా సేవ చేసేటువంటి రాజారావు సేవలు అమోఘమని మంత్రి సవిత కొనియాడారు…..


