ఘనంగా స్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు..


పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్
విశాలాంధ్ర ధర్మవరం : మండల పరిధిలోని నాగులూరు గ్రామం వద్ద గల రూపా రాజా పిసిఎన్ఆర్ పాఠశాలలో ఫ్రీ ప్రైమరీ గ్రాజియేషన్ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరములు విద్యార్థులు చేసిన ప్రయాణాన్ని కు గుర్తుగా, ఆనందంగా, ఉత్సాహభరితంగా, జ్ఞాపకాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం ప్రతిభగర పరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేయడం జరిగిందని వారు తెలిపారు. తదుపరి విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ముగ్ధుల్ని చేశాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు రూప రాజా కృష్ణ, జగదీష్, కర్రీస్పాండెంట్ నాగమోహన్ రెడ్డి, ప్రిన్సిపాల్ నరేష్ కుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

The post ఘనంగా స్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు.. appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *