YCP Janasena Plan: వైసీపీ, జనసేన కలవబోతున్నాయా.. ఏపీ రాజకీయాలు మారబోతున్నాయా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

YCP Janasena Plan: రాజకీయాలు ఎప్పుడూ బోర్ కొట్టవు. కారణం.. అవి ఎప్పుడూ స్థిరంగా ఉండవు. రకరకాల మార్పులు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో డీసీఎం పవన్ కళ్యాణ్.. పెద్ద కలకలమే రేపారు. చెప్పాలంటే.. టీడీపీకి టెన్షన్ తెప్పిస్తున్నారు. ఎందుకో తెలుసుకుందాం.

Rapid Read
వైసీపీ, జనసేన కలవబోతున్నాయా
వైసీపీ, జనసేన కలవబోతున్నాయా

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనే డైలాగ్ చాలాసార్లు వినే ఉంటారు. తాజాగా ఏపీ అసెంబ్లీలో డీసీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. ఇదే ఫీల్ కలిగినా ఆశ్చర్యం అక్కర్లేదు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యిపై జనసేనాని చేసిన వ్యాఖ్యలకు రకరకాల అర్థాలు తెరపైకి వస్తున్నాయి. వాటిని ఇక్కడ మనం చెప్పుకుందాం. అసలు పవన్ ఏమన్నారు అనేది చూస్తే.. ఈ లడ్డూ కల్తీ నెయ్యి విషయంలో జగన్ (పేరు చెప్పకుండా) తెలిసి చేసి ఉండకపోవచ్చనీ, టీడీపీ పాలకమండలి, అధికారులే ఈ తప్పిదానికి పాల్పడి ఉండొచ్చని అన్నారు. అంతేకాదు.. ఆలయాల కూల్చివేత సహా అనేక అంశాలపై తాను ఏనాడూ.. జగన్‌ని డైరెక్టుగా తప్పు పట్టట్లేదని అన్నారు. జగన్ స్వయంగా, కావాలని ఈ తప్పులకు పాల్పడి ఉండకపోవచ్చు అని అన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. చాలా కాలంగా ఆయన వైసీపీపై చేస్తున్న ఆరోపణలన్నీ తూచ్ అన్నట్లు మాట్లాడారు. ఈ మాటల్ని ఆయన యథాలాపంగా అనలేదు. కావాలనే, ఇంటెన్షనల్ గానే అన్నారు. అందుకే.. రెండు మూడు సార్లు చెబుతూ మళ్లీ మళ్లీ అన్నారు. తద్వారా ఆయన వైసీపీపై చేస్తున్న ఆరోపణలకు జనసేన దూరం జరుగుతోందనే సంకేతాలు ఇచ్చేశారు.

ఈ వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి?

పవన్ కళ్యాణ్ అమాయక నేత కాదు. ఆయన ఏం మాట్లాడినా.. దాని వెనక పెద్ద వ్యూహమే ఉంటుంది. అందుకే ఈ వ్యాఖ్యలపై పెద్ద చర్చే జరుగుతోంది. ఒక కోణం ఏంటంటే.. లడ్డూ కల్తీ విషయంలో ప కొవ్వు, గొ కొవ్వు కలవలేదు కాబట్టి.. అలా కలిశాయి అని అదే పనిగా ఆరోపణలు చేసిన టీడీపీకి అది నెగెటివ్ అయ్యింది కాబట్టి.. ఆ నెగెటివ్ తమ పార్టీకి రాకుండా, అంటకుండా ఉండేలా.. జాగ్రత్త పడుతూ.. జనసేన.. ఆ విమర్శల నుంచి దూరం జరుగుతోందనీ.. అలా వైసీపీకి టార్గెట్ అవ్వకుండా ఉండేందుకే పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడారనే విశ్లేషణ తెరపైకి వస్తోంది. దాని వల్ల భవిష్యత్తులో.. రాజకీయ వైరుధ్యం అనేది టీడీపీ, వైసీపీ మధ్యే ఉంటుంది.. జనసేన.. రెండు పార్టీలతోనూ శత్రుత్వం లేకుండా.. కొనసాగే ఛాన్స్ ఉంటుంది అని పవన్ కళ్యాణ్ వ్యూహం కావచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

వైసీపీ, జనసేన కలవబోతున్నాయా?:

అప్పుడే ఇలా ఆలోచించడం అతిశయోక్తి అనిపించవచ్చు. కానీ రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు అంటుంటారు. ఏపీలో టీడీపీ, వైసీపీ.. రెండింటిలో ఏది అధికారంలోకి రావాలన్నా… ఇప్పుడు జనసేన కీలకం. ఎందుకంటే.. ఈ పార్టీకి 20 శాతం దాకా ఓట్లు ఉన్నాయి. పైగా ప్రజల్లో పాజిటివ్ ఫీల్ ఉంది. కాబట్టి ప్రభావం చూపిస్తోంది. 2014లో జనసేన, టీడీపీ కలవడం వల్ల.. టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019లో టీడీపీతో జనసేన కలవలేదు. ఫలితంగా వైసీపీ అధికారంలోకి వచ్చింది. 2024లో మళ్లీ టీడీపీతో జనసేన కలిసేసరికి.. కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ లెక్కలను బట్టీ.. జనసేన ఏ పార్టీతో కలిస్తే.. ఆ పార్టీకి ప్లస్ అవ్వగలదని అనుకోవచ్చు. ఇలా ఎందుకు జరుగుతోందంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలా, వద్దా అనేది డిసైడ్ చెయ్యడంలో జనసేన కీలక పాత్ర పోషిస్తోంది. అందువల్ల.. టీడీపీకి జనసేన కీలక పార్టీ. నెక్ట్స్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, టీడీపీని వదిలేసి.. వైసీపీతో కలిస్తే.. అది వైసీపీకి ప్లస్ అవ్వగలదనే విశ్లేషణ ఉంది. అయితే.. అలా పవన్ కళ్యాణ్ చేస్తారా? అనేది ఇప్పుడే తెలియదు.

పవన్ కళ్యాణ్.. వచ్చే 15 ఏళ్ల పాటూ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది అని తరచూ అంటున్నారు. ఆ వ్యాఖ్యల్ని బట్టీ.. జనసేన, టీడీపీ 15 ఏళ్ల పాటూ కలిసి ఉంటాయి అని పవన్ అంటున్నారు అనే అర్థం వస్తోంది. కానీ.. మరో అర్థం ఇప్పుడు వస్తోంది. 15 ఏళ్లపాటూ.. అయితే టీడీపీ లేదా వైసీపీతో కలిసి జనసేన కూటమిగా ముందుకు వెళ్లి.. అధికారంలో ఉండగలదు అని పవన్ అంటున్నారా అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. ఈ విపరీత అర్థాలు ఎందుకు అంటే.. కారణం పవన్ చేసిన తాజా వ్యాఖ్యలే. ఆయనే ఈ వ్యూహాల తేనెతెట్టెను కదిపారు.

ఇవి కూడా చదవండి: Telangana and AP Weather Forecast Update: బలంగా తీవ్ర తుపాను.. ఏపీ, తెలంగాణపై ద్రోణి వాతావరణం.. అక్కడ వర్షాలు

పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఎలా ఉన్నా.. అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం.. టీడీపీకి ఇబ్బందిగా మారాయి. మొదటి నుంచి టీడీపీ టార్గెట్ వైసీపీయే. కానీ.. పవన్ కళ్యాణ్ ఇప్పుడు రూట్ మార్చారు. వైసీపీని బయటపడేస్తున్నారు. ముఖ్యంగా జగన్‌ తప్పేమీ లేదు అంటున్నారు. అలా అనడం ద్వారా.. ఆయన టీడీపీకి షాక్ ఇచ్చినట్లైంది. ఇది కూటమి కలిసి సాగే అంశంపై కూడా అనుమానాలు రేకెత్తిస్తోంది. కానీ ఇలా విశ్లేషించడం తప్పవుతుంది అనే కోణం కూడా ఉంది. కూటమి పార్టీలన్నీ సఖ్యతతో ఉంటే.. వాటి మధ్య చిచ్చు పెట్టేందుకే ఇలాంటి విశ్లేషణలను తెరపైకి తెస్తున్నారు అనే వాదన కూడా ఉంటోంది. మనం అన్నీ మాట్లాడుకుంటాం. అదేం తప్పు కాదు. భవిష్యత్తులో ఏమవుతుందో ఎవరికీ తెలియదు. బట్.. ఇప్పటి నుంచి ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తిగా మారతాయని మాత్రం అనుకోవచ్చు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *