Last Updated:
Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రెండు రోజులు నుండి తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఫిబ్రవరి నెలలోనే వేసవి కల్పిస్తున్న నేపథ్యంలో చల్లటి వాతావరణం ఏర్పడింది.
Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రెండు రోజులు నుండి తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఫిబ్రవరి నెలలోనే వేసవి కల్పిస్తున్న నేపథ్యంలో చల్లటి వాతావరణం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మండే ఎండలకు ఉపశమనం కల్పించే విధంగా ఈ వర్షాలు ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం , దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలో దక్షిణ కోస్తా ఉత్తరకొస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిస్తే అని అంటున్నారు.
ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ విధంగా వర్షాలు పడతాయి అని తెలిపారు. బుదవారం తేలికపాటినుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది అని తెలిపారు.
దక్షిణ కోస్తా జిల్లాల్లో బుదవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది అని తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది అన్నారు. బుదవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది అన్నారు. శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది అన్నారు.
రాయలసీమలో బుధవారం , గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది అన్నారు. శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అల్లూరి సీతారామరాజు జిల్లా , పార్వతీపురం మండలం జిల్లా , విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో రెండు రోజులపాటు తేలికపాటి , ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఏలూరు, ప్రకాశం మరియు రాయలసీమలోని నంద్యాల తదితర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయి అని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Visakhapatnam,Andhra Pradesh



