Weather Update: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వానలు! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

విశాఖ వాతావరణ కేంద్రం ప్రకారం రాయలసీమలో అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హెచ్చరిక.

Rapid Read
ఏపీ వాతావరణం లో ఒకసారిగా మార్పు.. తెలంగాణలో కూడా స్వల్ప మార్పులు.. కొద్దిపాటి వర
ఏపీ వాతావరణం లో ఒకసారిగా మార్పు.. తెలంగాణలో కూడా స్వల్ప మార్పులు.. కొద్దిపాటి వర

తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని అది మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికలు కేంద్రం విశాఖ వాతావరణ కేంద్రం సూచించింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతమైన అన్నమయ్య జిల్లా తిరుపతి చిత్తూరు ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. కోస్తా జిల్లాలకు కొద్దిపాటి వర్షాలు మాత్రమే ఉంటాయని వివరించింది.

నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని దీని ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని వివరించింది. వాతావరణ శాఖ ముఖ్యంగా ఏపీలో కొద్దిరోజులుగా చలి, పొడి వాతావరణం.. ఈమధ్య కాలంలో ఎండలతో ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతున్నాయి. మూడురోజుల నుంచీ ఉష్ణోగ్రతల పెరుగుదల కనిపిస్తోంది. పగటిపూట అంటే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎండలు గట్టిగానే కాస్తున్నాయి.

ఇక ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణం కేంద్రం వివరించింది. అటు హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ఆతర్వాత పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందందని పేర్కొంది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు చెట్ల క్రింద ఉండరాదని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం నుంచి ఎండలు ఇంకా పెరుగుతాయని విశాఖ వాతావరణం కేంద్రం వివరిస్తోంది.

ముఖ్యంగా ఏపీలోని రాయలసీమ ప్రాంతంలోని అటు కోస్తా జిల్లాల్లోనూ తెలంగాణలోనూ ఏజెన్సీ ప్రాంతాల్లోనూ కాస్త చలి వాతావరణం ఉంటుందని అయితే ఆదివారం నుంచి ఒక ఉష్ణోగ్రతల పెరుగుదల క్రమక్రమంగా పెరుగుతుందని వివరించింది. కొన్నిచోట్ల తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివరించండి ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 28 నుంచి 30 లోపే ఉన్నట్టు వివరించింది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *