Weather Update: ఉదయం ఎండ, రాత్రికి చలి.. మార్చిలో వాతావరణం ఎలా ఉంటుందంటే..? | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

Weather Update: విశాఖపట్నంలో అటు తెలుగు రాష్ట్రాల్లో వింతైన వాతావరణం నెలకొంటోంది. ఉదయం ఏడు గంటల వరకూ చలి తీవ్రత ఉంటోంది. పది గంటల నుంచి ఎండ తీవ్రత మొదలై.. మళ్లీ మధ్యాహ్నం మూడు గంటల వరకూ అదే వేడి కొనసాగుతోంది.

Rapid Read
+

Weather

Weather Update

Weather Update: విశాఖపట్నంలో అటు తెలుగు రాష్ట్రాల్లో వింతైన వాతావరణం నెలకొంటోంది. ఉదయం ఏడు గంటల వరకూ చలి తీవ్రత ఉంటోంది. పది గంటల నుంచి ఎండ తీవ్రత మొదలై.. మళ్లీ మధ్యాహ్నం మూడు గంటల వరకూ అదే వేడి కొనసాగుతోంది. సాయంత్రం అయిదు తర్వాత మళ్లీ వాతావరణం పూర్తిగా చల్లబడుతోంది. ఈ పరిస్థితి అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్  లో కూడా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది.

డిఫరెంట్ వెదర్..

విశాఖలో పరిస్థితి చూస్తే.. ఉదయం ఏడు, ఎనిమిది గంటలవరకూ చలి వీడటం లేదు. అర్థరాత్రి దాదాపు 20 డిగ్రీలకు లోపే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం మాత్రం ముప్పై డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత నమోదువుతోంది. అంటే ఉదయం నాలుగు గంటలు మాత్రమే వేడి ఉంటోంది. మిగతా అంతా శీతల గాలులు, చలి తీవ్రత ఉంటోంది. దీనిపై విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం, విశాఖ వాతావరణ సమాచార కేంద్రం అధికారులు “న్యూస్ 18″తో మాట్లాడారు. ఇది ట్రాన్షిషన్ పిరియడ్ అంటారని.. ఇలాంటి సందర్భంలో చలి, వేడి ఒకేసారి ప్రభావం చూపిస్తాయంటున్నారు.

మార్చి నుండే సెగలు..

ఈ ఏడాది మార్చి నుంచీ వేడి గాలులు మొదలవుతాయని.. అప్పటి దాకా వాతావరణం ఇలాగే ఉంటుందని వివరించారు. నైరుతీ, ఈశాన్య రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించాయని.. అలాగే ఆకాశం కూడా క్లియర్ గా ఉండటంతో ఈ రకమైన వేడిమి ఉంటుందని వివరించారు. మార్చి రెండో వారానికి ఎండలు ఎక్కువ అవుతాయని.. మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా. ఈ ఏడాది వేసవి ప్రభావం ఎక్కువే ఉంటుందని అధికారులు సూచించారు. అలాగే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా సూచనలు చేశారు. ఈ ఏడాదిలో ఇప్పటికి మూడు నెలలు చలి తీవ్రత కొనసాగిందని వివరించారు. ఇక ఫిబ్రవరి ఎండింగ్ లో చలి తీవ్రత పూర్తిగా తగ్గిపోతుందని.. అప్పటి నుంచీ ఎండలు దంచికొడతాయన్నది వాతావరణ శాఖ వివరణ.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *