Weather Forecast: ఏపీలో వింత వాతావరణం.. రాబోయే మూడు రోజులు జాగ్రత్త, పగలు ఎండ సాయంత్రం పిడుగులతో వర్షాలు.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

Weather Forecast: రాష్ట్రంలో మూడు రోజులు ఎండ తీవ్రత, ఉరుములు పిడుగులతో జల్లులు కొనసాగనున్నాయి, ముఖ్యంగా కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరిలో వర్షాలు, ప్రజలు చెట్ల కింద నిలవొద్దని హెచ్చరిక

ఏపీలో ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు..!
ఏపీలో ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు..!

రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్న నేపధ్యంలో ఎండ తీవ్రత, పిడుగులతో కూడిన అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

తెలంగాణ, రాయలసీమ, అంతర తమిళనాడు మీదుగా మన్నార్ వరకు ద్రోణి కొనసాగుతుందని తెలిపారు. దీని ప్రభావంతో గురువారం (09-04-26) కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు. బుధవారం సాయంత్రం 5 గంటల నాటికి తూర్పుగోదావరి(జి) పైడిమెట్టలో 44మిమీ, కాకినాడ(జి) డి.పోలవరంలో 37.7మిమీ, తూర్పుగోదావరి(జి) సీతానగరంలో 32.2మిమీ, అనకాపల్లి(జి) పాయకరావుపేటలో 26మిమీ చొప్పున అధిక వర్షపాతం నమోదైందని తెలిపారు.

మరోవైపు రాయలసీమ జిల్లాల్లో ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బుధవారం పల్నాడు(జి) క్రోసూరు, తిరుపతి (జి) వరదయ్యపాలెంలో 42.2°C, చిత్తూరు(జి) నగరిలో 42.1°C, నంద్యాల(జి) చాగలమర్రిలో 41.9°C, కడప(జి)పులివెందులలో 41.8°C,  అనంతపురం(జి) తెరన్నపల్లిలో 41.7°C, కర్నూలు(జి) తోవి, మార్కాపురం(జి) అనుములపల్లెలో 41.6°C, ప్రకాశం(జి) చెరువుకొమ్ముపాలెంలో 41.5°C చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

ప్రజలందరూ జాగ్రత్తలు వహించాలని తెలిపారు. ఉదయం ఎండలు , సాయంత్రం సమయంలో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని తెలిపారు. ఒక్కో ప్రాంతంలో భారీగా పిడుగులు పడతాయని అన్నారు. వర్షాలు పడే సమయంలో చెట్ల కింద ఉండరాదని అన్నారు. పిడుగులు పడే సమయంలో ఒకసారిగా నేలపై పడుకుంటే ప్రాణాలకి ప్రమాదం ఉండదని తెలిపారు. రాబోయే మూడు రోజులు పాటు ఇదే పరిస్థితి ఉంటుందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు తెలుపుతామని అన్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *