Weather Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. రాష్ట్రంలో భానుడి భగభగలు.. నేడు, రేపు తీవ్ర వడగాల్పుల హెచ్చరిక! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


శనివారం(28-03-26): శ్రీకాకుళం జిల్లా బూర్జ, విజయనగరం జిల్లా బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, గుర్ల, మెరకముడియం, రాజాం, రేగడి ఆముదాలవలస, సంతకవిటి, తెర్లాం, వంగర మండలాలు, పార్వతీపురంమన్యం జిల్లా బలిజిపేట, గరుగుబిల్లి, పాలకొండ, సాలూరు, సీతానగరం మండలాల్లో తీవ్ర వడగాల్పులు (16) ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.  రాయలసీమ జిల్లాల్లో 40-42°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం ఉందన్నారు. ఆయా ప్రజలు జాగ్రత్తలు వహించాలని తెలిపారు.

అలాగే రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు (68): విజయనగరం 4, పార్వతీపురం మన్యం7, పోలవరం 2, ఏలూరు 1, కృష్ణా 5, ఎన్టీఆర్ 9, గుంటూరు 16, బాపట్ల 1, పల్నాడు 21, ప్రకాశం జిల్లాల్లోని 2 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు  తెలిపారు. ఆదివారం18 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 29 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

శుక్రవారం నంద్యాల(జి) గుల్లదుర్తిలో 42.1°C, కడప(జి) కమలాపురంలో 42°C, పల్నాడు(జి) గురజాల, తిరుపతి(జి) వరదయ్యపాలెంలో 41.8°C, అనంతపురం(జి) తెరన్నపల్లి 41.6°C, కర్నూలు(జి) తోవిలో  41.4°C, కృష్ణా(జి) పెద్దపారుపూడి 41°C, ఏలూరు(జి) ధర్మాజీగూడెం 40.4°C, మార్కాపురం(జి) బొట్లగూడూరు 40.2°C, అన్నమయ్య(జి) కంభంవారిపల్లె 40.1°C, తూర్పుగోదావరి(జి) చిట్యాలలో 40°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని సూచించారు. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. చెవుల్లోకి వేడి గాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలన్నారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని తెలుపుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *