Last Updated: Feb 25, 2026, 16:31 IST
విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం దారపర్తి పంచాయతీ పరిధిలోని రాయపాలెం, మునుపురాయి, చప్పనిగడ్డ, విప్పమానువలస, పల్లపుదుంగాడ గ్రామాలకు చెందిన గిరిజన చిన్నారులు రోడ్డు సమస్యపై వినూత్న నిరసన చేపట్టారు. గుంతలతో నిండిన దారిలోనే నిలబడి, మెడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను ధరించి తమ బాధను తెలియజేశారు. “డిప్యూటీ సీఎం సార్.. మాకు రోడ్డు వేయండి.. మేము చదువుకుంటాం” అంటూ చిన్నారులు హృదయాన్ని కదిలించే విజ్ఞప్తి చేశారు.
#pawankalyan #vizianagaram


