Vizag Shocking Crime: అందుకే మౌనికను చంపి ముక్కలు చేశా.. కస్టడీలో కక్కిన నిజాలు ఇవే | ట్రెండింగ్


Last Updated:

Viral News: ఒక మనిషి సాటి మనిషిని అత్యంత కిరాతకంగా చంపారంటే వాళ్ల వల్ల హాని మనకు హాని జరుగుతుందనే భయం అయినా ఉండాలి..? లేదంటే వాళ్ల వల్లమ పరువు పోతుందనే కారణం అయినా అయి ఉండాలి. విశాఖపట్నం ఎల్వీనగర్‌లో పది రోజుల క్రితం మౌనిక అనే యువతి హత్య కేసు విచారణలో పోలీసులు నిందితుడ్ని లోతుగా ప్రశ్నిస్తే .. నమ్మలేని నిజాలు కక్కాడు రవీంద్ర.

+

Vizag

Vizag Shocking Crime

Viral News: ఒక మనిషి సాటి మనిషిని అత్యంత కిరాతకంగా చంపారంటే వాళ్ల వల్ల హాని మనకు హాని జరుగుతుందనే భయం అయినా ఉండాలి..? లేదంటే వాళ్ల వల్లమ పరువు పోతుందనే కారణం అయినా అయి ఉండాలి. విశాఖపట్నం ఎల్వీనగర్‌లో పది రోజుల క్రితం మౌనిక అనే యువతి హత్య కేసు విచారణలో పోలీసులు నిందితుడ్ని లోతుగా ప్రశ్నిస్తే .. నమ్మలేని నిజాలు కక్కాడు రవీంద్ర. ఈ కేసులో నిందితుడు రవీంద్ర పోలీసు కస్టడీలో చెప్పిన వివరాలు చూస్తే ఆశ్చర్యంగా ఉంది. మూడు రోజులుగా కొనసాగిన పోలీసు కస్టడీ విచారణలో రవీంద్ర అనేక కీలక విషయాలను బయటపెట్టినట్లు గాజువాక సీఐ పార్థసారథి తెలిపారు.  మిత్రుడి ఇంట్లోనే ప్రియురాలు మౌనికను హత్య చేసినట్లుగా స్వయంగా ఒప్పుకున్నాడు నిందితుడు రవీంద్ర. మాజీ ప్రియురాలిని చంపిన తర్వాత ఆమె డెడ్ బాడీని సూట్‌కేసులో పెట్టి తన ఇంటికి తీసుకెళ్లానని చెప్పాడు.

ఈ ఘటనలో సీసీ కెమెరా దృశ్యాలు కీలకంగా మారాయి. నిందితుడు సూట్‌కేస్‌తో వెళ్తున్న దృశ్యాలు పోలీసులకు ముఖ్య ఆధారాలుగా దొరికాయి. దీంతో కేసు దర్యాప్తు వేగంగా ముందుకు సాగుతోంది.

కస్టడీలో నిజాలు కక్కేశాడు..

విశాఖ నేవీలో ఉద్యోగం చేస్తున్న చింతాడ రవీంద్ర మౌనిక అనే తన మాజీ ప్రియురాలిని హత్య చేసి శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికిపారేశాడు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. ఆ విచారణలో రవీంద్ర చెప్పిన విషయాలు, మౌనికకు తనకు మధ్య జరిగిన సంభాషణ, ఆర్ధిక పరమైన విషయాలే అతడిలోని ఉన్మాదిని నిద్రలేపినట్లుగా అంగీకరించాడు. పోలీసుల కస్టడీ ముగియడంతో బుధవారం రవీంద్రను పోలీసులు కోర్టులో హాజరచారు. మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసు నగరంలో కలకలం రేపుతుండగా, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ స్థానికులు , దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.

మొదటి నుండి ఏమి జరిగింది..

ఇండియన్ నేవీ ఐఎన్ఎస్ డేగాలో ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న చింతాడ రవీంద్రాకు తాటిచెట్లపాలెం ప్రాంతానికి చెందిన మౌనిక 2021 నుంచి డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైంది. గత ఐదేళ్లుగా ఇద్దరు మధ్య స్నేహం కొనసాగింది. మార్చి 29వ తేదీన గాజువాక ఎల్. వి నగర్  రవీంద్ర స్నేసుతుడు నివాసానికి మౌనిక వచ్చిందని ఇద్దరు మధ్య గొడవలు జరగడంతో  హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని సూట్‌కేసులో వేసి రవీంద్ర ఇంటికి తీసుకువచ్చాడు.

రవీంద్ర మాటల్లో ..

రవీంద్రకు పెళ్లయిందని తన భార్య డెలివరీ నిమిత్తం పుట్టింటికి వెళ్ళిందని, మౌనిక ఆర్థికంగా ఇబ్బంది పెడుతుందని,  ఆమెను అడ్డు తొలగించుకోవాలని హత్య చేయాలని నిర్ణయించుకున్నానని రవీంద్ర తెలిపినట్లు పోలీసు తెలిపారు. చనిపోయిన తర్వాత ఆమె మృతదేహం కూడా దొరక్కుండా చేయాలని ఉద్దేశంతో ఆమె తల, చేతులు, కాళ్లు కత్తితో  నరికి కాళ్లు, మొండం  కవర్లో చుట్టి ముండం భాగం ఫ్రిడ్జ్ లో పెట్టాడు.  కాళ్లు ట్రాలీ బ్యాగ్ లోని పెట్టి తల చేతులు ఒక బ్యాగులో పెట్టుకుని ఎవరికి తెలియకుండా అడవివరం దారపాలెం సమీపంలో ఎవరో చూడకుండా నిర్జన ప్రదేశంలో తల, చేతులు భాగమును పెట్రోల్ పోసి తగలబెట్టినట్టు రవీంద్ర తెలిపాడు.

రక్తచరిత్ర..

ఇంట్లో ఉన్న రక్తపు మరకలు కనపడకుండా పూర్తిగా నీళ్లతో కడిగినట్లు రవీంద్ర ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. మౌనిక తల్లిదండ్రులు గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని  మృతురాలి శరీర భాగములను  పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం  కేజీహెచ్ తరలించామని తెలిపారు. శిక్ష పడే విధముగా ఇన్వెస్టిగేషన్లో అన్ని రకాలుగా వివిధ కోణాలలో ఐదు టీములతో దర్యాప్తు చేశామని తెలిపారు. రవీంద్ర కోర్టులో హాజరు పరచి రిమాండ్ కి తరలించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *