Visakhapatnam as capital hopes fade |ఉత్తరాంధ్ర భవిష్యత్తు ఏంటి..?



గతంలో విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని ప్రకటించినప్పుడు, ఉత్తరాంధ్రలో కొత్త ఆశలు పుట్టాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రజలు దీనిని తమ ప్రాంత అభివృద్ధికి ఒక గొప్ప అవకాశంగా భావించారు. విశాఖపట్నం వంటి ప్రధాన నగరం దగ్గరగా ఉండటం వల్ల, పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, ప్రభుత్వ కార్యాలయాలు వస్తాయని, స్థానిక యువతకు ఉద్యోగాలు లభిస్తాయని నమ్మకం ఏర్పడింది. 100 నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నా, ఇది పెద్ద అవకాశంగా భావించారు. అయితే ఇప్పుడు అమరావతి ఒక్కటే రాజధానిగా నిలవడంతో, విశాఖ ఆర్థిక రాజధాని కాన్సెప్ట్ వెనక్కి వెళ్లినట్టుగా కనిపిస్తోంది. దీంతో ఉత్తరాంధ్ర ప్రజల్లో ఒక రకమైన నిరాశ నెలకొంది. “మన ప్రాంత అభివృద్ధి మళ్లీ ఆలస్యం అవుతుందా?” అనే సందేహం పెరుగుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *