Viral Video: వీధుల్లో తిరుగుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయలు.. ఎందుకో ఈ వీడియో చూడండి | జాబ్స్ & ఎడ్యుకేషన్


Last Updated:

Viral Video: విజయనగరం పట్టణంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ను పెంచేందుకు బిపిఎం నగరపాలక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు.

+

వీధిలో

వీధిలో తిరుగుతున్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయలు ఎందుకో తెలుసా 

Viral Video: విజయనగరం పట్టణంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ను పెంచేందుకు బిపిఎం నగరపాలక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలను ప్రజలకు వివరించేందుకు ఉపాధ్యాయులు ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను కలుస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమానికి స్థానిక ప్రజల నుండి మంచి స్పందన లభిస్తున్నట్లు పాఠశాల సిబ్బంది తెలిపారు.

ప్రభుత్వ టీచర్ల పాట్లు..

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఒత్తిడి లేని బోధన అందించబడుతుందని ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శంకర్రావు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉండటం వల్ల విద్యార్థులు సమగ్రంగా అభివృద్ధి చెందుతారని పేర్కొన్నారు. అదనంగా, విద్యార్థులపై ఆర్థిక భారం లేకుండా పూర్తిగా ఉచితంగా విద్య అందించడం ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకత అని తెలియజేశారు. ప్రస్తుతం ఈ విద్యా సంవత్సరంలో బిపిఎం నగరపాలక ఉన్నత పాఠశాలలో 539 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, వచ్చే విద్యా సంవత్సరంలో ఈ సంఖ్యను 700 లకు పెంచే లక్ష్యంతో “ఎన్రోల్మెంట్ డ్రైవ్” నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇంటింటి ప్రచారం ద్వారా తల్లిదండ్రుల్లో అవగాహన పెంచి, ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెంచడమే తమ లక్ష్యమని చెప్పారు.

ఇంటింటికి తిరుగుతూ..

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అనేక ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా, ఎన్.ఎం.ఎం.ఎస్ (National Means-cum-Merit Scholarship) స్కాలర్షిప్‌కు ఈ ప్రభుత్వ పాఠశాల విద్యార్థలకు ఇస్తున్నట్లు,ఈ స్కాలర్షిప్ గురించి ప్రత్యేకంగా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.అదేవిధంగా, త్రిబుల్ ఐటీ (IIIT)లో ప్రవేశాలకు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి లో ఎక్కవ మార్క్ లు తెచ్చుకున్న విద్యార్థులకు మొదటగా ప్రాధాన్యత లభిస్తుందని వివరించారు. పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ముందుగా సీట్లు కేటాయించే అవకాశం ఉందని తెలిపారు.

విద్యార్ధుల్ని స్కూల్‌లో చేర్చమని వేడుకోలు..

ఇంకా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకం, యూనిఫారాలు తల్లి కి వందనం ఇంటి లో ఎంత మంది ఉంటే అందరకి వర్తిస్తుంది వంటి అనేక సౌకర్యాలు ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు.ఈ సౌకర్యాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న అపోహలను తొలగించి, నాణ్యమైన విద్యను అందించే ఈ సంస్థలపై విశ్వాసం పెంపొందించేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న ఈ ఇంటింటి ప్రచారం కార్యక్రమం విజయవంతం కావాలని స్థానికులు ఆశిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో మరింత మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరి, వారి భవిష్యత్తును మెరుగుపరచాలని ఉపాధ్యాయులు ఆకాంక్షిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, జాబ్ మేళా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, లేటెస్ట్ కోర్సులు, స్కాలర్‌షిప్స్, విద్యకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీలో తెలుసుకోండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *