గత కొన్ని రోజులుగా స్థిరంగా పెరుగుతూ సామాన్యులకు అందనంత ఎత్తుకు వెళ్లిన బంగారం ధరలు గత వారం రోజులుగా నేల చూపులు చూస్తున్నాయి. గత శనివారం రోజు పెరిగిన బంగారం ధరలు.. సోమవారం (మార్చి 9, 2026) నాడు భారీగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలు, డాలర్ విలువ పెరగడం వల్ల దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, విజయవాడలలో పసిడి ధరలు గణనీయంగా పడిపోయాయి. ఒకే రోజు తులం బంగారంపై దాదాపు రూ. 1,800 నుండి రూ. 2,000 వరకు తగ్గడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.



