Vijayawada Elevated Flyover: విజయవాడకు మహా మహర్దశ.. ఆ ప్రాంతాల గుండా ఆరు లైన్ల ఫ్లైఓవర్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

Vijayawada News: విజయవాడ ప్రజల ట్రాఫిక్ కష్టాలకు కాస్త ఉపశమనం కలిగించే గుడ్ న్యూస్. ఆయా మార్గాల్లో 14 కిలోమీటర్ల ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ కారిడార్ అందుబాటులోకి రానుంది.

Rapid Read
Vijayawada News: విజయవాడ ప్రజల ట్రాఫిక్ కష్టాలకు కాస్త ఉపశమనం కలిగించే గుడ్ న్యూస్. ఆయా మార్గాల్లో 14 కిలోమీటర్ల ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ కారిడార్ అందుబాటులోకి రానుంది.
Vijayawada News: విజయవాడ ప్రజల ట్రాఫిక్ కష్టాలకు కాస్త ఉపశమనం కలిగించే గుడ్ న్యూస్. ఆయా మార్గాల్లో 14 కిలోమీటర్ల ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ కారిడార్ అందుబాటులోకి రానుంది.

Vijayawada News: విజయవాడ ప్రజల ట్రాఫిక్ కష్టాలకు కాస్త ఉపశమనం కలిగించే గుడ్ న్యూస్. ఆయా మార్గాల్లో 14 కిలోమీటర్ల ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ కారిడార్ అందుబాటులోకి రానుంది. దీన్ని హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం హైవే మార్గంలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా దీనిపై ప్రతిపాదన తీసుకువచ్చారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.

ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే, విజయవాడలోని కనకదుర్గ వారధి నుంచి గంగూరు క్రాస్ వరకు 14 కిలోమీటర్ల మేర ఈ ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ కారిడార్ వేయనున్నారు.ఈ మేరకు కొత్త ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతుంది. హైదరాబాద్-మచిలీపట్నం జాతీయ రహదారిలో విజయవాడ నగర పరిధిలో ఉన్నంత వరకు ఆ మార్గంలో ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ నిర్మించే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తుంది.

ఈ ఫ్లై ఓవర్ పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలోని రాజీవ్ పార్క్ వద్ద మొదలయ్యే కనకదుర్గ ఫ్లై ఓవర్ నుంచి మట్నదలుకొని మంచిలీపట్నం వైపు వెళ్లే మార్గంలోని గంగూరు కూడలి వరకు మట్నత్తంగా 14 కిలోమీటర్ల మేర ఈ పైవంతెన నిర్మించాలని భావిస్తున్నారు. ఇది ఆరు వరుసలతో నిర్మించే ఫ్లై ఓవర్ కావడంతో హైవేలో ప్రయాణించే వారికి ఏ ఆటంకాలూ ఉండవని, విజయవాడ నగర ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఈ ప్రాజెక్టును ఎలా చేపట్టవచ్చన్న భిన్న ప్రణాళికలపై దిల్లీ స్థాయిలో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చర్చలు జరుపుతున్నారు. హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం హైవే-65పై విజయవాడ పరిధిలో ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, భవానీపురం, కనకదుర్గ ఫ్లై ఓవర్, కృష్ణలంక, వారధి జంక్షన్, బెంజ్ సర్కిల్, ఆటోనగర్ గేట్, కానూరు, పోరంకి, పెనమలూరు మీదుగా ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించాలని చూస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్-విజయవాడ మధ్య ఎన్‌హెచ్-65 ను నాలుగు వరుసలు నుంచి ఆరు వరుసలుగా విస్తరించేందుకు ప్రాజెక్టు చేపట్టిన విషయం తెలిసిందే.

దీన్ని గొల్లపూడి వద్ద విజయవాడ బైపాస్ క్రాస్ అయ్యే పాయింట్ వరకే విస్తరించాలని ముందుగా అనుకున్నారు. కానీ ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు భవానీపురం వద్ద కనకదుర్గ ఫ్లై ఓవర్ దాకా విస్తరించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ ఒప్పుకుంది. ఈ మేరకు డీపీఆర్‌ను సైతం సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే విజయవాడ-మచిలీపట్నం హైవేను ఆరు వరుసలుగా విస్తరించే ప్రాజెక్టు కూడా చేపట్టారు.

దీంతో విజయవాడ నగర పరిధిలో కనకదుర్గ ఫ్లై ఓవర్ తర్వాతి నుంచి కృష్ణలంక, వారధి జంక్షన్, స్క్రూబ్రిడ్జి, బెంజ్ సర్కిల్, కానూరు, పోరంకి, పెనమలూరు, గంగూరు, కంకిపాడు మీదుగా దావులూరు టోల్ ప్లాజా వరకు నాలుగు వరుసలుగా ఈ రహదారి మిగిలి పోనుంది. వాహన రద్దీ ఎక్కువగా ఉండే విజయవాడ నగరం మధ్యలో నాలుగు వరుసలుగా మిగిలిపోతే ఎలాగన్న ప్రశ్న తలెత్తింది. దీనికి విజయవాడలో ఆరు వరుసలతో ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ నిర్మించడమే పరిష్కారమన్న అంచనాకు అధికారులు వచ్చారు. తద్వారా కనకదుర్గ ఫ్లై ఓవర్ నుంచి గంగూరు కూడలి వరకు ఆరు వరుసలతో ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *