TTD Parakamani Case: ‘వైసీపీ నేతలను నిందితులుగా చేర్చేందుకు అతడికి బాధ్యతలు’.. పరకామణి చోరీ కేసుపై భూమన సంచలన వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

TTD Parakamani Case: పరకామణి చోరీ కేసుపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఆ విషయంలో తమకు పూర్తి సమాచారం అందిందన్నారు. తిరుపతిలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం.

Rapid Read
ttd parakamani case: పరకామణి చోరీ కేసుపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఆ విషయంలో తమకు పూర్తి సమాచారం అందిందన్నారు. తిరుపతిలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం.
ttd parakamani case: పరకామణి చోరీ కేసుపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఆ విషయంలో తమకు పూర్తి సమాచారం అందిందన్నారు. తిరుపతిలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం.

TTD Parakamani Theft Case: తిరుమల పరకామణి వ్యవహారంలో మళ్లీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని, ఈ కేసులో వైసీపీ నేతలను నిందితులుగా చేర్చే దిశగా ఒక డీఎస్పీకి బాధ్యతలు అప్పగించారని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. రెండు రోజుల్లో తిరిగి టీటీడీ ద్వారా ఫిర్యాదు నమోదు చేసే అవకాశం ఉందని.. ఈ విషయంపై తమకు సమాచారం అందిందన్నారు. తిరుపతిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చర్యల వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని వ్యాఖ్యానించారు.

పరకామణి కేసులో ఇప్పటికే ఇద్దరు డీజీ స్థాయి అధికారులు విచారణ పూర్తి చేసి కోర్టుకు నివేదిక సమర్పించిన తర్వాత మరోసారి విచారణ పేరుతో డీఎస్పీ స్థాయి అధికారిని నియమించడం అనుమానాస్పదందా ఉందని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన ఆరోపణలు చేశారు. తమకు అనుకూలంగా నివేదిక సిద్ధం చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే సందేహాన్ని ఆయన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులనే లక్ష్యంగా చేసుకుని ఈ చర్యలు తీసుకుంటున్నారని ఆయన విమర్శలు చేశారు.

అలాగే తిరుమ లడ్డూ నెయ్యి కల్తీ అంశంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం చట్టబట్టతపై కూడా భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నలు లేవనెత్తారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని కోర్టు నిర్ణయాలను పక్కన పెట్టే చర్యగా భావించాల్సి వస్తుందని అన్నారు. సిట్ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో మరో కమిషన్ ఏర్పాటు చేయడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలు చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితి తలెత్తుతుందని తెలిపారు.

మండలిలో వైసీపీ సభ్యులు దేవుడి చిత్రపటాలు ఎందుకు తీసుకుని వెళ్లకూడదు:

మండలిలో వైసీపీ సభ్యులు దేవుడి చిత్రపటాలు తీసుకెళ్లిన విషయంపై జరుగుతున్న విమర్శలపై కూడా టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన స్పందించారు. శాసనసభ, మండలిలో దేవుడి ఫొటోలు తీసుకెళ్లడాన్ని ఎందుకు అభ్యంతరంగా చూస్తున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో సీఎం చంద్రబాబు గతంలో శ్రీవారి విగ్రహాలను పలువురికి బహుమతులుగా ఇచ్చిన సందర్భాలను గుర్తు చేశారు. అప్పుడు అది తప్పు కాకపోతే, ఇప్పుడు దేవుడి చిత్రపటాలు తీసుకెళ్లడం ఎందుకు తప్పవుతుందో చెప్పాలని ఆయన పలు ప్రశ్నలు లేవనెత్తారు.

ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ నోటీసులు:

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొనసాగిన కాలంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై పలు ఆరోపణలు, ఫిర్యాదులు చేసిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆళ్ల రామకృష్ణారెడ్డికు ఏసీబీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెట్, అసైన్డ్ భూముల వ్యవహారాలకు సంబంధించి సమర్పించిన ఫిర్యాదులపై తగిన ఆధారాలు కనిపించలేదని ఏపీ సీబీడీ ప్రాథమికంగా నిర్థారించినట్లు తెలుస్తోంది.

సాక్ష్యాలు సమర్పించలేకపోతే కేసు ఎందుకు కొనసాగించాలన్న విషయంపై వివరణ ఇవ్వాలని పేర్కొంటూ, ఏసీబీ అధికారులు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి నోటీసులు పంపించారు. ఈ నెల 27న విజయవాడలోని ఏసీబీ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఫిర్యాదుదారు బలమైన ఆధారాలు చూపించకపోతే కేసు బలహీనమయ్యే అవకాశముంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *