ఇక టీటీడీ నూతనంగా తీసుకొచ్చిన ‘కాటేజ్ డొనేషన్ పాలసీ’ విషయానికొస్తే, పాత విధానంలో ఉన్న లోపాలను సవరించి పూర్తి పారదర్శకతతో దీనిని రూపొందించారు. విరాళాలు ఇచ్చే విధానాన్ని పూర్తిగా ఆన్లైన్ చేసి, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఆటోమేటెడ్ వ్యవస్థను తీసుకొచ్చారు. నూతన గెస్ట్ హౌస్ లేదా కాటేజీ నిర్మాణానికి టీటీడీ అనుమతి ఇచ్చిన వెంటనే, దాతలు తమ నామినీని అధికారికంగా నియమించుకునే సదుపాయాన్ని ఈ కొత్త విధానం కల్పిస్తోంది. భక్తుల భద్రత దృష్ట్యా ప్రతి అతిథి గృహంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, వాటిని తిరుమలలోని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.



