Tribal Welfare: గిరిజన ప్రాంతాల అభివృద్దికి వందల కోట్ల నిధులు.. అక్కడ రూ.490 కోట్లతో పనులకు శ్రీకారం |


Last Updated:

Tribal Welfare: పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. రూ. 490 కోట్లతో సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ , గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు.

+

490

490 కోట్లతో సాలూరు అభివృద్ధికి శ్రీకారంగిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రా

Tribal Welfare: పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. రూ. 490 కోట్లతో సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ , గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు.

ఈ నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బడ్జెట్‌లో కేటాయించినట్లు ఆమె పేర్కొన్నారు.

సాలూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం, విద్య, ఆరోగ్య రంగాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. ఈ అభివృద్ధి పనులు సమర్థవంతంగా అమలు కావాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు. రాజకీయ భేదాలను పక్కనబెట్టి అన్ని పార్టీలు కలిసి పనిచేస్తేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు.

ఈ సందర్భంగా “చెత్త నుండి సంపద” అనే లక్ష్యంతో రూపొందించిన ఆధునిక వ్యర్థ నిర్వహణ ప్రాజెక్టును మంత్రి ప్రారంభించారు. అత్యాధునిక యంత్రసామగ్రి ద్వారా తడి, పొడి చెత్తను వేరుచేసే యంత్రాన్ని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డితో కలిసి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ యంత్రం ద్వారా చెత్తను సమర్థవంతంగా వర్గీకరించి, పునర్వినియోగం చేసే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. దీనివల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు ఆదాయం కూడా సాధ్యమవుతుందని మంత్రి వివరించారు.

సాలూరు మున్సిపాలిటీని శుభ్రంగా, సుందరంగా మార్చడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని మంత్రి తెలిపారు. చెత్త నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, ప్రతి కుటుంబం తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని కోరారు. దీనివల్ల పట్టణంలో పరిశుభ్రత పెరిగి, వ్యాధులు తగ్గే అవకాశముందని పేర్కొన్నారు.

అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు ప్రత్యేక పథకాలు అమలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. విద్య, ఉపాధి, ఆరోగ్య సేవలను గ్రామ స్థాయికి తీసుకెళ్లి గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. మహిళలు, పిల్లల సంక్షేమానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

సాలూరు నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి, ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజల సహకారం అవసరమని, అందరూ కలిసి ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *