Last Updated:
రంపచోడవరం పోలవరం జిల్లా యువ కలెక్టర్ దినేష్ కుమార్ పేదలతో మమేకమై సమస్యలు పరిష్కరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు, వృద్ధురాలి గ్యాస్ సమస్యను వెంటనే పరిష్కరించమని ఆదేశించారు
కొంతమంది అధికారులను చూస్తే వయసుతో సంబంధం లేకుండా రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టాలనిపిస్తుంది, ఒక్కొక్కరిని చూస్తే ఈయన ఇంతే అన్న విధంగా మనసులో ఆయన గురించి మరో రకంగా మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ అక్కడ వయసులో చిన్నవాడైనా కలెక్టర్ వచ్చారా ప్రజలు ఎదురువచ్చి రెండు చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తారు. ఆయన కలెక్టర్ హోదా సైతం మరిచిపోయి ప్రజలతో మమేకం అవుతూ ఉంటారు, ఏపీలో అలాంటి ఆదర్శ కలెక్టరేట్ ఎక్కడున్నారు. ఆయన గురించి ప్రజలు ఎందుకలా తహతహలాడుతున్నారు? ఒకసారి ఆ వివరాలు క్లుప్తంగా చూద్దాం..
గోదావరి జిల్లాలకు సంబంధించి తూర్పు ఏజెన్సీ రంపచోడవరం పోలవరం జిల్లాకి యువ కలెక్టర్గా దినేష్ కుమార్ సేవలందిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలి అంటే కలెక్టర్ హోదాను మరిచిపోయి ఒక శ్రామికుడు మాదిరిగా ఆయన ప్రజలకు సమస్యలు పరిష్కరించడంలో ముందుకు వెళుతుంటారని గిరి పుత్రులు పేర్కొంటున్నారు. తాజాగా ఏప్రిల్ ఒకటవ తేదీ సందర్భంగా రంపచోడవరం నియోజకవర్గం సిరిగిందలపాడు గ్రామంలో పింఛన్ పంపిణీ చేసేందుకు ఆయన చేరుకున్నారు.
పింఛన్ పంపిణీ చేసే క్రమంలోనే ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి తరుణంలో ఒక వృద్ధురాలు కూర్చున్న పాకలో ఆయన సైతం కింద కూర్చున్నారు, పింఛన్ సమయంకు అందుతుందా ఇలా కష్టసుఖాలు తెలుసుకుంటున్న సమయంలోనే గ్యాస్ సమస్య ఆ వృద్ధురాలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. రేషన్ కార్డు ఉంది కదమ్మా మరి నీకు గ్యాస్ రావడం లేదా? ఎందుకు రాలేదు? ఏంటి అన్న విషయాలు ఆరా తీయకుండా ఈరోజు సాయంత్రం లోపు అవ్వవద్దకు గ్యాస్ రావాలి, గ్యాస్ ఇచ్చినట్టు ఫోటో తీసి నాకు పెట్టాలి అని కలెక్టర్ అక్కడున్న అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
అంతే ఆ వృద్ధురాలు ఆనందాలకు అవధులు లేవని చెప్పుకోవచ్చు. ఇలా ఒక్క గ్యాస్ అనే కాదు గిరి పుత్రులో ఉన్న సమస్యలు పరిష్కరించడంలో మా కలెక్టర్ బాబు సాటి మరి ఎవరు లేరు అంటూ గిరిపుత్రులు పేర్కొంటూ ఉంటారు. కలెక్టర్ అంటే హుందాగా ఆ డ్రెస్ ఆపై సెక్యూరిటీ కాదు, ఒక సామాన్యుడిగా ఆ జిల్లాలో ఆయన సేవలందించడం పట్ల గిరిపుత్రులు ఆయన దేవుడిగా కొలుస్తున్నారని చెప్పుకోవచ్చు. బహుశా కష్టపడి పైకి వచ్చారు ఏమోగానీ ముందు పేదప్రజల సమస్య అంటే తీర్చిన తర్వాతే మరో పనిలోకి దిగుతారని ఆయన వెనుకున్నవారు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి ఆదర్శ కలెక్టర్ ను పలువురు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana


