Tragic Road Accident: దేవుడి ఆశీస్సుల కోసం వెళ్లిన ఫ్యామిలీ.. ఆ ఐదుగుర్ని వెంటాడిన మృత్యువు | చిత్తూరు వార్తలు (Chittoor News)


Last Updated:

Tragic Road Accident: ఇంట్లో పెళ్లి వేడుక జరిగే ముందు తమ ఆరాధ్యదైవమైన తిరుమల శ్రీవారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకుందామని బయల్దేరారు. కుటుంబ సభ్యులందురు కలిసి కారులో బయలుదేరారు. ఇంతలోనే విధి చిన్న చూపు చూసింది. మార్గం మధ్యలో మరణశాసనం రాసి ఉందని ఊహించలేకపోయారు.

+

దేవుడు

దేవుడు అశీసులు కోసం వెళ్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుల ఇంట విషాదం

Road Accident: ఆ కుటుంబ సభ్యుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో బంధువులు ఎంతో సంతోషించారు. గంటల వ్యవధిలో బంధు, మిత్రుల మధ్య నవ్వుతూ పెళ్లి వేడుకల్లో గడపుతారని అందరూ భావించారు. ఈ వేడుక జరిగే ముందు తమ ఆరాధ్యదైవమైన తిరుమల శ్రీవారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకుందామని బయల్దేరారు. కుటుంబ సభ్యులందురు కలిసి కారులో తిరుమలకు బయలుదేరారు. ఇంతలోనే విధి చిన్న చూపు చూసింది. అలా జరుగుతుందని వాళ్లు కలలో కూడా ఊహించలేదు. పెళ్లి కావాల్సిన వారి వాహనాన్ని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వెంటాడింది. ఫలితంగా ఐదుగురు మృత్యువాత పడ్డారు. చూడటానికి ప్రతీ ఒక్కరిని కన్నీరు పెట్టించిన ఈ వార్త విన్నవారికి కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. కారులో తిరుమలకు వెళ్తుండగా ముందు వెళ్తున్న సిమెంట్ లారీని 130 కి మీ వేగంతో వెళ్లి ఢీ కొనడంతో లారీ వెనుక వైపు ఇరుక్కొని అక్కడిక్కడే మృతి చెందారు.ఈఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. మృతులు కర్నాటకకు చెందిన వారిగా పోలీసులు తేల్చారు.

పెళ్లి బంధువుల వాహనానికి యాక్సిడెంట్..

అన్నీ మంచి శకునాలే అనుకుంటే పొరపాటు పడినట్లే. మనం ఊహించినట్లుగానే జరుగుతుందనుకోవడం మన భ్రమ. ఇంట్లో పెళ్లి వేడుక పెట్టుకొని కారులో తిరుమల శ్రీవారి దర్శనానికి బయల్దేరిన ఓ ఫ్యామిలీ రోడ్డు ప్రమాదం రూపంలో చావు ఒడికి చేరడం అందర్ని కంటతడి పెట్టించింది. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం సమీపంలోని హైవేపై ఈ దుర్ఘటన జరిగింది. బెంగళూరులోని రాజాజీనగర్ కు చెందిన మోహన్దాస్ ,కుసుమ భార్యాభర్తలు. నాగరాజరావు, జయంతి మరో వృద్ధ దంపతులు. కుసుమ, జయంతి అక్కాచెల్లెళ్లు. నాగరాజరావుకు కుమార్తె పూజ కారులో ఉన్నారు. కారు చిత్తూరు జిల్లా పలమనేరు హైవేపై చేరుకున్న సమయంలో ముందు వెళ్తున్న సిమెంట్ లారీని బలంగా ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ మరణవార్త తెలిసి తోటి మిత్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలను స్థానిక సి ఐ మోహన్ కుమార్ తెలిపారు. కారులో ఉన్న ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయి ఉంటే డ్రైవర్ వెనుక భాగంలో కూర్చున్న ముగ్గురు వ్యక్తులు ప్రమాదం నుండి బయటపడేవారని చెప్పారు. కారు డ్రైవర్ నిద్రలోకి జారుకోవడం వల్లే ఈ ప్రమాదానికి కారణమైందని నిర్ధారించారు.

భగవంతుడి ఆశీస్సుల కోసం వెళ్తూ..

శుభకార్యానికి ముందు తిరుమలకు వెళ్లాలని బుధవారం వేకువ జామున ఇంటి నుంచి కారులో బయలుదేరారు ఐదుగురు. కారును మోహన్ రావు నడుపుతుండగా ఆయన పక్కన భార్య కుసుమ కూర్చున్నారు. వెనుక వైపు నాగరాజరావు, జయంతి, పూజ కూర్చున్నారు. ముళబాగల్ వద్ద ఉదయం 8 గంటలకు టిఫిన్ చేశారు. కారు పల మనేరు వద్ద బైపాస్ లో సరిగ్గా 9.05 నిమిషాల ప్రాంతంలో గంటకు 130 కి.మీ వేగంతో వెళుతున్న కారు ముందు వెళు తున్న ఖాళీ సిమెంట్ లారీని ఢీకొని లారీ కిందకు దూసుకెళ్లింది. దీన్ని గమనించని లారీ డ్రైవర్ కొంతదూరం అలాగే వెళ్లిపోయాడు. పక్కరూట్లో వెళ్లే వాహ నాల డ్రైవర్లు కేకలు వేయడంతో లారీని ఆపాడు. అప్పటికే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు, అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. వేగంగా కారు ఢీకొనడంతో నిమిషాల వ్యవధిలో అందులో ఉన్న వారందరూ మృతి చెందారు.

నుజ్జు నుజ్జు..

లారీ వెనుక భాగంలో ఇరుక్కుపోయిన కారును జేసీబీతో అతికష్టం మీద వెనక్కిలాగారు. అప్పటికే కారులోంచి నాగరాజరావు శవం కిందపడింది. ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి దాదాపు 300 మీటర్లకు పైగా లారీ కారును ఈడ్చుకువెళ్లింది. లారీ డ్రైవర్ కు సైడ్ మిర్రర్ లోనూ కారు కనిపించలేదు. పక్కనున్న డ్రైవ ర్లు చెప్పడంతోనే లారీని ఆపాడు. ఈ విషయం అక్కడున్న సీసీ కెమెరా పుటేజీలో తేలింది. కారులో అందరూ సీటు బెల్టులు ధరించే ఉన్నారు. ప్రమాదం జరిగినా ఎయిర్ బెలూన్లు ఓపెన్ కాలేదు. కారు ముందు వైపున్న సెన్సార్లకు సంబంధం లేకుండా కారు లారీ కిందికి వెళ్లడంతో సెన్సార్లు పనిచేయలేదని తెలుస్తోంది. బెలూన్లు తెరుచుకొని ఉంటే వెనుకనున్న ముగ్గురైనా ప్రాణాలతో భయటపడేవారేమో.

ఓవర్ స్పీడ్ కిల్స్..

వైఎస్సార్ సర్కిల్లో స్పీడ్ బ్రేకర్లున్నాయి. ఈ మార్గంలో గంటకు 50 కి.మీ వేగంతో లారీ వెళ్తాం ది. వెనుక వైపు నుంచి వచ్చిన కారు గంటకు 130 కి.మీ వేగంతో లారీ కిందికి దూసుకెళ్లింది. ఘటనా స్థలంలో కనీసం కారుకు బ్రేకు వేసి ఉంటే రోడ్డుపై టైర్ మార్కులు పడాలి. అవేమీ లేనందున డ్రైవర్ బ్రేక్ వేయలేదని స్థానిక ఎంవీఐ మధుసూదన్ ప్రాథమికంగా నిర్ధారించారు. నెలలో రెండుసార్లు శ్రీవారిని దర్శించుకునే తమ కుటుంబానికి ఆ దేవుడు ఈ శిక్షవేయడం ఏంటి..? అని కుసుమ, జయంతి అన్న రోదించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. మృతుల్లో నాగరాజరావు గతంలో బాళ్లారి జిల్లా పరిశ్రమల శాఖ అధికారిగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఇతని కుమార్తె పూజ సైతం మృతి చెందింది. ఆమె బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజి నీర్ గా పనిచేస్తోంది. నాగరాజరావు కుమారుడు ప్రస్తుతం జర్మనీలో ఉన్నాడని.. ఇరాన్-అమెరికా యుద్ధం నేపథ్యంలో కడసారి చూపుకై నా కొడుకు వస్తాడో లేదోనని కొందరు రోదించడం అందరినీ కలచి వేసింది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *